Share News

kumaram bheem asifabad- ‘అంగన్‌వాడీ’ల్లో కూరగాయల సాగు

ABN , Publish Date - Sep 07 , 2025 | 10:50 PM

అంగన్‌ వాడీ కేంద్రాల ద్వారా పిల్ల లు, గర్భిణులు, బాలింతల సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే అంగన్‌వాడీ కేంద్రాలలో ఇకపై కూరగాయలు, ఆకు కూరలు పండించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. అందుకు పోషణ్‌ వాటిక అని పేరుతో ప్రభుత్వం సూచించింది.

kumaram bheem asifabad- ‘అంగన్‌వాడీ’ల్లో కూరగాయల సాగు
లోగో

- జిల్లా వ్యాప్తంగా 100 కేంద్రాల గుర్తింపు

- ఒక్కో కేంద్రానికి రూ.10 వేలు మంజూరు చేసిన కేంద్రం

బెజ్జూరు, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): అంగన్‌ వాడీ కేంద్రాల ద్వారా పిల్ల లు, గర్భిణులు, బాలింతల సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే అంగన్‌వాడీ కేంద్రాలలో ఇకపై కూరగాయలు, ఆకు కూరలు పండించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. అందుకు పోషణ్‌ వాటిక అని పేరుతో ప్రభుత్వం సూచించింది. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 100 కేంద్రా లను ఎంపిక చేయడంతో పాటు తోటల నిర్వహణ కోసం ఒక్కో కేంద్రానికి రూ.10 వేలు కూడా మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా కూరగాయల విత్తనా లను త్వరలో పంపిణీ చేసేందుకు జిల్లా అధికారులు సమాయత్తం చేస్తున్నారు.

- జిల్లాలో 973 అంగన్‌వాడీ కేంద్రాలు..

జిల్లా వ్యాప్తంగా మొత్తం 973 అంగన్‌వాడీ కేంద్రా లు ఉండగా సొంత భవనాలు ఉన్న కేంద్రాలు 317, పాఠశాలల్లో కొనసాగుతున్న భవనాలు 353, అద్దె భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాలు 303 కొనసాగుతు న్నాయి. జిల్లాలో కూరగాయల సాగుకు స్థలం అ నుకూలంగా ఉన్నవి 100 కేంద్రాలను గుర్తించారు. ఇందులో భాగంగా ఇప్పటికే 72 కేంద్రాలను గుర్తిం చగా మరో 28 కేంద్రాలను గుర్తించేందుకు అధికా రులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో సొంత భవనంలో కొనసాగుతున్న కేంద్రా లకు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. కూరగాయల సాగు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక్క కేంద్రానికి రూ.10 వేలు కేటాయించింది. ఆ నిధులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. మంజూ రైన నిధులను ఎలా ఎందు కోసం ఖర్చు చేయాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయనుంది. ఆ ప్రకారం ఆయా కేంద్రాలకు త్వరలోనే నిధులు రానున్నాయి. ప్రభుత్వం కేటాయిం చిన నిధులతో ఖాళీ స్థలాలను చదును చేసి కూరగాయ లు, ఆకుకూరల పెంపకం కోసం స్థలాన్ని చదువు చేసి సిద్ధం చేస్తారు. అలాగే విత్తనాలు, సారవంతమైన మట్టి, ఎరువు కోసం ఈ డబ్బును ఖర్చు చేయను న్నారు. వీటిని ఉద్యానశాఖ అధికారులు పర్యవేక్షిం చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

- విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు..

జిల్లాలో పోషణ్‌ వాటిక కార్యక్రమంలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో కూరగాయల సాగు కోసం ప్రభుత్వం శ్రీకారం చుట్టగా అందుకు అనుగుణంగా విత్తనాల పంపిణీకి ఏర్పాట్లను చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం జాకీ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా విత్తనాలు పంపిణీకి ఏర్పాట్లు చేస్తోది. ఇందులో ట మాట, బెండకాయ, ముల్లంగి, మునగ, ఆకు కూరలు, ఇతర కూరగాయల విత్తనాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఎంపిక చేసిన కేంద్రా ల్లో స్థలం అనుకూలమైన వాటిని గుర్తించి ఆయా ప్రాంతాల్లో ఏ విధమైన కూరగాయల సాగు ఏపట్టాల ని దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. గుర్తిం చిన కేంద్రాలకు ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాల టీచ ర్లకు సమాచారాన్ని అందించినట్లు తెలుస్తోంది.

- పౌష్టికాహారాన్ని అందించేందుకే..

అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ ధ్యేయంగా ప్రభుత్వం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఎంపిక చేసిన అంగన్‌వాడీ కేంద్రాల్లో సేంద్రీయ పద్దతుల్లో కూరగాయలు, ఆకు కూరలను పెంచేందుకు చర్యలు చేపట్టింది. కేంద్రాల్లో చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య బోధించడంతో పాటు గర్భిణులు, బాలింతలు చిన్నారులకు పోషకాహారం అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతోంది. బహిరంగ మార్కెట్‌లో అవ సరానికి సరిపడ కూరగాయలు ఆకుకూరలు దొరకడం లేదు. అలాగే ధరలు పెరగడం నాణ్యత కురవడంతో క్షేత్రస్థాయిలో సమస్యలు వస్తున్నాయి. కూరగాయల ధరలు పెరిగిన సమయంలో ప్రభుత్వం కేటాయించే నిధులు సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో ఖాళీ స్థలాలు ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో కూరగాయలు, ఆకుకూరలు పండించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం సొంత భవనాలు, ఖాళీ స్థలాలు ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలు గుర్తించి కూర గాయల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టింది. కానీ అంగన్‌వాడీ కేంద్రాల్లో కూరగాయల సాగు పెంపకానికి చర్యలు తీసుకోగా కేంద్రాల్లో సరిపడా నీటి వసతి, స్థలాల కొరత కారణంగా కూరగాయల పెంపకం సాధ్యమయ్యేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పోషణ్‌ వాటికల ఏర్పాటుకు చర్యలు..

- ఆడెపు భాస్కర్‌, జిల్లా సంక్షేమ శాఖాధికారి

జిల్లాలో 100 కేంద్రాల్లో పోషణ్‌ వాటికలను ఏ ర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అంగన్‌ వాడీ టీచర్లకు ఆకుకూరల సాగుపై ఉద్యాన శాఖ అధికారులతో శిక్షణ ఇప్పిస్తాం. త్వరలోనే విత్తనాల ప్యాకేట్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తాం. కేంద్రాల ఆవరణ లోనే పెంచితే చిన్నారులకు తాజా కూరగాయలతో పోషకాహారాన్ని అందించేందుకు అవకాశం ఉంది. ఎం పిక చేసిన కేంద్రాల్లో త్వరలోనే అమలు చేస్తాం.

Updated Date - Sep 07 , 2025 | 10:50 PM