Veeranari Chakali Ailamma: గాంధీభవన్‌లో ఐలమ్మ జయంతి వేడుక
ABN , Publish Date - Sep 27 , 2025 | 04:13 AM
గాంధీభవన్‌లో శుక్రవారం వీరనారి చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి.. అయిలమ్మ..
గాంధీభవన్‌లో శుక్రవారం వీరనారి చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి.. అయిలమ్మ వారసులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ఐలమ్మ చిత్రపటానికి ఆయన నివాళిని అర్పించారు. అలాగే మంత్రి సీతక్క అయిలమ్మ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళిని అర్పించారు. . కాగా.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా గాంధీభవన్‌లో ఆయన చిత్రపటానికి మంత్రి సీతక్క, పార్టీ నేతలు నివాళి అర్పించారు. మరోవైపు.. శాసనసభ భవనంలోని మెంబర్స్ లాంజ్‌లో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు.