Share News

Veena Kumari Appointed: పోస్టల్‌ సర్కిల్‌ చీఫ్‌గా వీణాకుమారి

ABN , Publish Date - Sep 17 , 2025 | 05:02 AM

తెలంగాణ సర్కిల్‌ చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌గా డాక్టర్‌ వీణా కుమారి డెర్మల్‌ నూతనంగా బాధ్యతలు స్వీకరించారు..

Veena Kumari Appointed: పోస్టల్‌ సర్కిల్‌ చీఫ్‌గా వీణాకుమారి

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సర్కిల్‌ చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌గా డాక్టర్‌ వీణా కుమారి డెర్మల్‌ నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈమె 1998 బ్యాచ్‌కు చెందిన భారతీయ పోస్టల్‌ సర్వీస్‌ అధికారి. గతంలో ఇండియన్‌ పోస్టల్‌ శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ (పీఎంయూ)గా పనిచేసిన వీణా కుమారి, దేశవ్యాప్తంగా అడ్వాన్స్‌డ్‌ పోస్టల్‌ టెక్నాలజీ (ఏపీటీ) 2.0 విస్తరణలో కీలక పాత్ర పోషించారు. ఆమె తన 27 ఏళ్ల సర్వీసులో పోస్టల్‌ శాఖలో ఆధునికసాంకేతికను, సంస్కరణలను ప్రవేశపెట్టి, దేశవ్యాప్తంగా ఉన్న 1.5 లక్షల పోస్టాఫీసుల్లో వాటిని విజయవంతంగా అమలు చేశారు.

Updated Date - Sep 17 , 2025 | 05:02 AM