Share News

ఘనంగా వాసవీ మాత జయంతి

ABN , Publish Date - May 07 , 2025 | 10:55 PM

పట్టణంలోని శ్రీకన్యకాపరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్యుల ఆరాద్య దైవం అయిన వాసవీమాతా జ యంతి వేడుకలను బుధవారం వైభవంగా నిర్వహించారు. మహి ళలు వేకువజామునే ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వ హించారు.

ఘనంగా వాసవీ మాత జయంతి
తాండూర్‌లో కుంకుమ పూజలు చేస్తున్న మహిళలు

లక్షెట్టిపేట, మే 7(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని శ్రీకన్యకాపరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్యుల ఆరాద్య దైవం అయిన వాసవీమాతా జ యంతి వేడుకలను బుధవారం వైభవంగా నిర్వహించారు. మహి ళలు వేకువజామునే ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈకార్యక్ర మంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆవోపా సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.

తాండూర్‌ : తాండూర్‌ మండల కేంద్రంలోని శ్రీ వాసవీ కన్యకప రమేశ్వరి ఆలయంలో బుధవారం తాండూర్‌ వాసవీ క్లబ్‌ ఆధ్వర్యంలో వాసవీమాత జయంతి వేడుకలను ఘనంగ ఆనిర్వహించారు. మహి ళలు ప్రత్యేక అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వినాయకరావు తీర్ద ప్రసాదాలను అందజేశారు. ఈ కార్య క్రమంలో వాసవీ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ జిల్లా 107ఏ కార్పోరేట్‌ వైస్‌ చైర్మన్‌ సంతోష్‌కుమార్‌,ఆలయ కమిటీ అధ్యక్షుడు బోనగిరి చంద్రశే ఖర్‌, అధ్యక్షుడు మదుసూదన్‌రావు, అక్షయ, సంతోష్‌, సత్యనారా య ణ, రమేష్‌, హేమలత, సువర్ణ, విజయ, సునీత, ఇందిరమ్మ, విజ యలక్ష్మీ, మాధవి పాల్గొన్నారు.

జన్నారం : మండల కేంద్రంలోని శ్రీ మహాలక్ష్మీ సహిత నాగదే వత దేవాలయంలో ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవీ మాత జ యంతి వేడుకలను బుధవారం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిం చారు. వేద పండితులు గుండి గణేష్‌ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదా లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు, మాజీ సర్పంచు జక్కు భూమేష్‌, ప్రధాన కార్యదర్శి గోపా లకృష్ణ, వర్తక సంఘం అధ్యక్షుడు వామన్‌ పాల్గొన్నారు.

Updated Date - May 07 , 2025 | 10:55 PM