kumaram bheem asifabad- ఘనంగా వరలక్ష్మీ వ్రతం
ABN , Publish Date - Aug 08 , 2025 | 11:22 PM
శ్రావణ శుక్రావారాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా మహిళలు వైభవంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఆలయాల్లో అమ్మవారలను పూలతో విశేషంగా అలంకరించారు. మహిళలు సామూహిక వ్రతాలు, కుంకుమార్చన పూజలు నిర్వహించారు.
ఆసిఫాబాద్‌రూరల్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): శ్రావణ శుక్రావారాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా మహిళలు వైభవంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఆలయాల్లో అమ్మవారలను పూలతో విశేషంగా అలంకరించారు. మహిళలు సామూహిక వ్రతాలు, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఒకరికొకరు వాయినాలు అందజేశారు. వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో వాసవి మాతకు చీర సారె కార్యక్ర మాన్ని నిర్వహించారు. శ్రీసరస్వతి శిశు మందిర్ పాఠశాలలో సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు.
కాగజ్‌నగర్, (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ పట్టణంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆయా పాఠశాలల్లో వరలక్ష్మి వ్రతాలను చేపట్టారు. స్థానిక శిశు మందిర్ పాఠశాలలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, నాగరాణి తదితరలు పాల్గొన్నారు.
కెరమెరి, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో వరలక్ష్మీ వ్రతం పర్వది నాన్ని మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా తమ ఇళ్లను ప్రత్యేకంగా అలరించుకొని లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేశారు.