Share News

ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చిన గీతం వందేమాతరం

ABN , Publish Date - Nov 17 , 2025 | 11:27 PM

స్వాతంత్య్ర పోరా టంలో ప్రజలందర్ని ఏకతాటిపైకి తెచ్చింది వందేమాతర గీతం అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాధ్‌ వెరబెల్లి పేర్కొన్నారు. మంచిర్యాల పట్టణం లోని మార్కెట్‌ రోడ్డులో సామూహిక వందేమాతర గీతాలాపన చేపట్టారు.

ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చిన గీతం వందేమాతరం

మంచిర్యాల కలెక్టరేట్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : స్వాతంత్య్ర పోరా టంలో ప్రజలందర్ని ఏకతాటిపైకి తెచ్చింది వందేమాతర గీతం అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాధ్‌ వెరబెల్లి పేర్కొన్నారు. మంచిర్యాల పట్టణం లోని మార్కెట్‌ రోడ్డులో సామూహిక వందేమాతర గీతాలాపన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంకించంద్ర చటర్జీ రచించిన వందే మాతర గేయం స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రజలందరిలో పోరాట స్ఫూర్తిని రగిలిచిందన్నారు. స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన వారిని ప్రతి ఒ క్కరు తలుచుకుంటూ వారి ఆశయాలను కొనసాగించాలన్నారు. ఈ కా ర్య క్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌, నాయకులు గాజుల ముకేష్‌గౌడ్‌, పురషోత్తం జాజు, వంగపల్లి వెంకటేశ్వర్‌రావు, కృష్ణ మూర్తి, శ్రీశైలం, చక్రవర్తి, వేణుగోపాల్‌, కమలాకర్‌రావు, ప్రభాకర్‌, శ్రీధర్‌, నాగేశ్వర్‌రావు, తిరుపతి, వెంకటేశ్వర్లు, వ్యాపారులు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2025 | 11:27 PM