మంచిర్యాలలో వందేభారత్ రైలును నిలపాలి
ABN , Publish Date - Aug 08 , 2025 | 12:05 AM
మంచిర్యాల రైల్వే స్టేష న్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నిలుపుదల చేయాలని ఎమ్మెల్సీ అం జిరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు రఘునాధ్ వెరబెల్లి, మున్సిపల్ మాజీ చర్మ న్ గాజుల ముకేష్‌గౌడ్ కోరారు. గురువారం సికింద్రాబాద్ రైల్ నిలయం లో రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవకు వినతి పత్రం అందించారు.
మంచిర్యాల కలెక్టరేట్, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి) : మంచిర్యాల రైల్వే స్టేష న్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నిలుపుదల చేయాలని ఎమ్మెల్సీ అం జిరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు రఘునాధ్ వెరబెల్లి, మున్సిపల్ మాజీ చర్మ న్ గాజుల ముకేష్‌గౌడ్ కోరారు. గురువారం సికింద్రాబాద్ రైల్ నిలయం లో రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవకు వినతి పత్రం అందించారు. వారు మాట్లాడుతూ మంచిర్యాల రైల్వేస్టేషన్ ఎన్‌ఎస్‌జీ 3 కేటగిరిలో ఉం దని, ఏడాదికి 23 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తుందన్నారు. మంచిర్యాల ప్రాంతం నుంచి 13 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణి స్తున్నా వందేభారత్, ఇతర రైళ్లు నిలపడం లేదన్నారు. జిల్లా నుంచి అనేక మంది వ్యాపారులు, విద్యార్థులు, ప్రజలు ఇతర ప్రాంతాలకు ప్రయాణి స్తుంటారన్నారు. మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో సికింద్రాబాద్-నాగ్‌పూర్ వందే భారత్ రైలును నిలుపుదల చేయాలని కోరారు. అలాగే మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి వేల మంది తిరుపతికి వెళ్తుంటారని, మంచిర్యా ల నుంచి తిరుపతికి రైలును నడపాలని కోరారు. చెన్నయ్ సెంట్రల్ భగ త్‌కి కోటి రైలుకు మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో హాల్టింగ్ ఇవ్వాలన్నారు. మంచి ర్యాలలోని హమాలీవాడ రైల్వే గేట్ వద్ద ఫుడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని విన్నవించారు.