Vande Bharat Train Schedules to Change: డిసెంబరు నుంచి వందేభారత్ షెడ్యూలు మార్పు
ABN , Publish Date - Sep 13 , 2025 | 05:54 AM
తెలుగు రాష్ట్రాల పరిధిలో ప్రయాణించే నాలుగు వందేభారత్ రైళ్ల షెడ్యూల్‌లో మార్పులు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది....
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల పరిధిలో ప్రయాణించే నాలుగు వందేభారత్ రైళ్ల షెడ్యూల్‌లో మార్పులు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ-యశ్వంత్‌పూర్-కాచిగూడ (20703-20704) మఽధ్య నడిచే రెండు వందేభారత్ రైళ్లకు ఇప్పటివరకు బుధవారం మినహాయింపు ఉండగా, డిసెంబర్ 12నుంచి శుక్రవారానికి మారుతుందని రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్-విశాఖపట్నం-సికింద్రాబాద్ (20707-20708) మధ్య ప్రయాణించే మరో రెండు వందేభారత్ రైళ్లకు ప్రతి గురువారం మినహాయింపు ఉండగా.. డిసెంబర్ 5నుంచి సోమవారానికి మార్చినట్టు తెలియజేశారు.