Share News

వన మహోత్సవం లక్ష్యాలను చేరుకోవాలి

ABN , Publish Date - Jul 04 , 2025 | 11:32 PM

వాతావర ణ సమతుల్యతను కాపాడేందుకు ప్రభుత్వం చే పట్టిన వన మహోత్సవం కార్యక్రమం లక్ష్యాల ను పూర్తి స్థాయిలో సాధించాలని కలెక్టర్‌ కుమా ర్‌ దీపక్‌ అన్నారు.

వన మహోత్సవం లక్ష్యాలను చేరుకోవాలి

హాజీపూర్‌, జూలై4 (ఆంధ్రజ్యోతి): వాతావర ణ సమతుల్యతను కాపాడేందుకు ప్రభుత్వం చే పట్టిన వన మహోత్సవం కార్యక్రమం లక్ష్యాల ను పూర్తి స్థాయిలో సాధించాలని కలెక్టర్‌ కుమా ర్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని క ర్నమామిడి గ్రామ పంచాయతీలో గల కస్తూ ర్భాగాంధీ బాలికల విద్యాలయ ఆవరణలో వన మహోత్సవం 2025 కార్యక్రమంలో భాగంగా జి ల్లా గ్రామీణాభివృద్ది అధికారి కిషన్‌, డీఈవో యాదయ్య, ఎంపీడీవో ప్రసాద్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సం దర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వాతావరణ స మతుల్యాన్ని కాపాడుతూ భావితరాలకు సహజ సిద్ధమైన వాయువును అందించేందుకు ప్రభు త్వం వన మహోత్సవం కార్యక్రమం ద్వారా మొ క్కలు నాటుతామని తెలిపారు. ప్రతి ఒక్కరు త మ వంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షిం చాలని తెలిపారు.

జిల్లాలోని ఆయా శాఖలకు మొక్కలు నాటేం దుకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేసే విధం గా అధికారులు, సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ పీవో మల్లయ్య, ఈసీ శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి వెం కటేశ్‌లు పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2025 | 11:32 PM