Share News

Vamanrao Case: సీబీఐ చేతికి వామనరావు దంపతుల హత్య కేసు

ABN , Publish Date - Sep 03 , 2025 | 05:10 AM

న్యాయవాది వామనరావు దంపతుల హత్య కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐ చేపట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది..

Vamanrao Case: సీబీఐ చేతికి వామనరావు దంపతుల హత్య కేసు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): న్యాయవాది వామనరావు దంపతుల హత్య కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐ చేపట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఎఫ్‌ఐఆర్‌లో వెల్ది వసంతరావు, కుంట శ్రీనివాస్‌, అక్కపాక కుమార్‌ పేర్లను నిందితులుగా చేర్చింది. కేసు దర్యాప్తు అధికారిగా ఇన్‌స్పెక్టర్‌ విపిన్‌ గహలోత్‌ వ్యవహరించనున్నారు. పెద్దపల్లి జిల్లా రామగరి మండలం కల్వచర్ల వద్ద 2021 ఫిబ్రవరి 17న వామనరావు దంపతులను హత్య చేసిన ఘటన నాడు సంచలనం సృష్టించింది. దర్యాప్తు జరిపిన రాష్ట్ర పోలీసులు కొందర్ని అరెస్టు చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని వామనరావు తండ్రి గట్టు కిషన్‌రావు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగిస్తూ గత నెల 12న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - Sep 03 , 2025 | 05:10 AM