ఘనంగా వైకుంఠ ఏకాదశి
ABN , Publish Date - Dec 30 , 2025 | 11:32 PM
పట్టణంలోని పలు ఆల యాల్లో సోమవారం వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహిం చారు. ఉదయం నుంచే ఆలయాలకు భ క్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనం కోసం ఆలయాల వద్ద క్యూకట్టారు. స్థానిక వెంకటేశ్వర ఆల యంలో ఉదయం నుంచే భక్తులు క్యూకట్టారు.
బారులు తీరిన భక్తులు
పూజలు నిర్వహించిన సీపీ, కలెక్టర్ దంపతులు
మందమర్రిటౌన్,డిసెంబరు30(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పలు ఆల యాల్లో సోమవారం వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహిం చారు. ఉదయం నుంచే ఆలయాలకు భ క్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనం కోసం ఆలయాల వద్ద క్యూకట్టారు. స్థానిక వెంకటేశ్వర ఆల యంలో ఉదయం నుంచే భక్తులు క్యూకట్టారు. పంచముఖ ఆంజనేయ ఆలయం వద్ద కూడ భక్తులు బారులు తీరారు. పెట్టుకొని మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి నేతృత్వంలోని ఎస్‌ఐ రాజశేఖర్, తగు చర్యలు చేప ట్టా రు. కలెక్టర్ కుమార్ దీపక్‌తో పాటు రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా దంపతులు, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు, డీసీపీ భాస్కర్, యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు బండి సదానందం దంపతులు, మందమర్రి జీఎం రాధాక్రిష్ణతో పాటు సీఐ శశిధర్‌రెడ్డి, తహసీ ల్దార్ సతీష్ కుమార్ పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు అనంత చార్యులు స్వామి ప్రసాదాలు అందజేశారు.