వచ్చే నెల 6న వైద్మ శిబిరం
ABN , Publish Date - Oct 25 , 2025 | 11:05 PM
అచ్చంపేట ఏరియా ఆసుపత్రిలో నవంబరు 6న ఉచిత మెగా మల్టీ స్పెషాలిటీ మెడికల్ క్యాం పును నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే డా క్టర్ వంశీకృష్ణ అన్నారు.
- ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
అచ్చంపేట, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి) : అచ్చంపేట ఏరియా ఆసుపత్రిలో నవంబరు 6న ఉచిత మెగా మల్టీ స్పెషాలిటీ మెడికల్ క్యాం పును నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే డా క్టర్ వంశీకృష్ణ అన్నారు. శనివారం ప ట్టణంలోని ఏరియా ఆసుపత్రిని పరిశీ లించారు. అక్కడ రోగులకు అందుతు న్న వైద్య సేవలగురించి అడిగి తెలుసు కున్నారు. ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ ఎస్‌వీఎస్ ఆసుపత్రి వారి సౌజన్యంతో సీబీఎం ట్రస్ట్ సహకారంతో మల్టీ స్పెషాలిటీ మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. దాదాపు 40 మంది వైద్యులు ఈ శిబిరంలో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని అచ్చంపేట నియోజకవర్గం కాకుం డా జిల్లాలోని నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, నియో జకవర్గాలతో పాటు పక్కనున్న దేవరకొండ ని యోజకవర్గ ప్రజలు కూడా ఉపయోగించుకోవా లని ఆయన కోరారు. కార్యక్రమంలో డాక్టర్లు ప్రదీప్, బిక్కునాయక్, వైద్య సిబ్బంది ఉన్నారు.
స్టేడియం విస్తరణ పనుల పరిశీలన
పట్టణంలోని రాజీవ్, ఎన్టీఆర్ స్టేడియం వి స్తరణ పనులను శనివారం ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మునిసిపల్ కమిషనర్, సంబంఽధిత అధికారులతో కలిసి పరిశీలించారు. సీతారాల గుంట, హౌసింగ్ కార్యాలయం వైపు స్టేడియం విస్తరణ పనులు చేపడుతున్నారు. తర్వలో ప నులు పూర్తిఅయ్యేలా చర్యలు చేపట్టాలని ఆయ న అధికారులకు, కాంట్రాక్టర్‌కు సూచించారు. ఆయన వెంట కౌన్సిలర్ నిర్మలాబాలరాజు, ఆకుల వెంకటేష్ ఉన్నారు.