Share News

kumaram bheem asifabad- జీవాలకు టీకా రక్ష

ABN , Publish Date - Nov 05 , 2025 | 10:54 PM

పశువులు, గొర్రెలు, మేకలు, మొదలగు జంతువులకు సంక్రమించే వైరస్‌ వ్యాధుల్లో గాలికుంటు వ్యాధి ముఖ్యమైనది, ఈ వ్యాధి సోకితే నోటికి, గిట్టలకు పుళ్లవుతాయి. ఇది సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమ మని అధికారులు చెబుతున్నారు. గాలి, ఇతర మార్గాల్లో ఇది సంక్రమిస్తుంది. మరణాల శాతం తక్కువైనప్పటికీ ఉత్పాదక శక్తి తగ్గి రైతులకు తీవ్ర ఆర్థిక నష్టం కలుగుతుంది.

kumaram bheem asifabad- జీవాలకు టీకా రక్ష
పవర్‌గూడలో టీకా వేస్తున్న వైద్య సిబ్బంది(ఫైల్‌)

- రైతులు సద్వినియోగం చేసుకోవాలని పశువైద్యుల సూచన

జైనూర్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): పశువులు, గొర్రెలు, మేకలు, మొదలగు జంతువులకు సంక్రమించే వైరస్‌ వ్యాధుల్లో గాలికుంటు వ్యాధి ముఖ్యమైనది, ఈ వ్యాధి సోకితే నోటికి, గిట్టలకు పుళ్లవుతాయి. ఇది సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమ మని అధికారులు చెబుతున్నారు. గాలి, ఇతర మార్గాల్లో ఇది సంక్రమిస్తుంది. మరణాల శాతం తక్కువైనప్పటికీ ఉత్పాదక శక్తి తగ్గి రైతులకు తీవ్ర ఆర్థిక నష్టం కలుగుతుంది. జిల్లాలో వ్యవసాయంతో పాటు పాడి పశువు ల పెంపకం ద్వారా రైతులు ఆదనపు ఆదాయం గడిస్తున్నారు. ఈ క్రమంలో పశువులు రోగాల బారిన పడి పోషకులు నష్ట పోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా రెండుసార్లు గాలి కుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ మేరకు గత నెల రెండో తేదీ నుంచి ఈ నెల 14వ తేదీ వరకు టీకా వేయించే కార్యక్రమానికి పంశు సంవర్ధక శాక శ్రీకారం చుట్టింది. దేశ వ్యాప్తంగా 2030 నాటికి గాలికుంటు వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలనే ఉద్ధేశంతో కేంద్రం ముందుకెళ్తోంది.

వ్యాధి లక్షణాలు ఇలా..

గాలికుంటు వ్యాధి లక్షణాలు గొర్రెలు, మేకల్లో కన్నా పశువుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. శరీర ఉష్ణోగ్రత 104- 106 డిగ్రీల సెల్షియన్‌ ఉంటుంది. నోటిలో చర్మపు పొరలు, పళ్ల చిగుళ్లు, నాలుక, లోపలి ప్రాంతాల్లో బొబ్బలు పొక్కి చితకడం వల్ల పశువులు మేత తినవు. నోటి నుంచి చొంగ, నురుగు విపరీతంగా కారుతుంది. గిట్టల మధ్య గిట్టపైన బొబ్బలు ఏర్పడి చితికి పుళ్లవుతాయి. నొప్లి వల్ల పశువులు నడిచే సమయంలో కుంటుతాయి. చను మొనలపై కూడా బొబ్బలు ఏర్పడి పొదుగు వాపు కనిపిస్తుంది. వ్యాధి సోకిన పశువుల పాలు తాగితే దూడలు మరణిస్తాయి. దుక్కిటి పశువులు వ్యవసాయ పనులకు ఉపయోగపడవు, చూలి పశువులకు గర్భస్రావల వుతాయి. పశువులు రక్తహీనతకు గురై శ్వాస కష్టంగా పీల్చుతూ, రొప్పుతూ, ఎండ వేడిమికి తట్టుకోలేక నీరసించిపోతాయి. ఇవి గమనిస్తే వ్యాధి లక్షణాలు ఉన్న పశువులను ఇతర వాటి నుంచి వేరు చేసి చికిత్స అందించాలి.

- ఆరు నెలలకొకసారి..

కేంద్ర సర్కారు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఈ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేస్తోంది. నాలుగు నెలల వయస్సు దాటిని ఆవులు, గేదెలకు ఆరు నెలలకొసారి టీకాలు వేస్తారు. ఈ వ్యాధి సోకడంతో మరణాల సంఖ్య తక్కువగా ఉన్నా.. పశువుల్లో ఉత్పాదక, పునరుత్పత్తి శక్తి సామర్థ్యం కుంటు పడుతుంది. మార్చి, ఏప్రిల్‌, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలలో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తుంది. దీంతో పాడి రైతులకు ఆర్థికంగా నష్టం జరుగుతుంది. టీకా ఇప్పిస్తే వ్యాధి సోకకుండా నివారించొచ్చు. పాల ఉత్పత్తి తగకుండా ఉంటుంది. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు ప్రతి రోజు గ్రామాల వారీగా తిరుగుతు పశువులకు టీకా వేస్తున్నారు. రైతులు తప్పక తమ తమ పశువులకు టీకాలు వేయించాలని పశు వైద్య సిబ్బంది గ్రామాల్లో రైతులకు ఆవగాహన కల్పిసు ్తన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకో వాలని వైద్య సిబ్బంది కోరుతున్నారు.

Updated Date - Nov 05 , 2025 | 10:54 PM