Share News

వైద్య ఆరోగ్యశాఖలో వెక్కిరిస్తున్న ఖాళీలు

ABN , Publish Date - Nov 14 , 2025 | 11:12 PM

రాష్ట్రంలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వం పదే పదే చెబుతున్నా అది క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. కీలక పోస్టుల్లో ఖాళీల కారణంగా ఇన్‌చార్జిలతో కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

వైద్య ఆరోగ్యశాఖలో వెక్కిరిస్తున్న ఖాళీలు
జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి

-డీఎంహెచ్‌వో సహా పలు పోస్టులు..

-పీహెచ్‌సీలలోనూ వేధిస్తున్న సిబ్బంది కొరత

-క్లస్టర్‌ హెల్త్‌ సెంటర్లదీ అదే పరిస్థితి

-ఇన్‌చార్జిలతో కాలం వెళ్లదీస్తున్న ఉన్నతాధికారులు

మంచిర్యాల, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వం పదే పదే చెబుతున్నా అది క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. కీలక పోస్టుల్లో ఖాళీల కారణంగా ఇన్‌చార్జిలతో కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ముఖ్య విభాగాల్లోనూ డిపార్ట్‌మెంటల్‌ అధిపతులు లేక పోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. జిల్లాలో ప్రభు త్వ జనరల్‌ హాస్పిటల్‌తోపాటు 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 03 కమ్యూనిటీ హెల్ట్‌ సెంటర్లు, 01 పీపీ యూనిట్‌ (ఇమ్యూనైజేషన్‌ అండ్‌ ఫ్యామిలీ ప్లానింగ్‌ సెంటర్‌), 04 అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు, 04 బస్తీ దవాఖానాలు, 01 ఆప్తాల్మిక్‌ యూనిట్‌ ఉన్నాయి. ప్రతీ పీహెచ్‌సీలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌లతోపాటు సీహె చ్‌ఓ, పీహెచ్‌ఎన్‌, సీనియర్‌ అసిస్టెంట్లు, స్టాఫ్‌ నర్సులు, ఏపీఎంఓ, ఎంపీహెచ్‌ఎస్‌, గ్రేడ్‌-2 ఫార్మాసిస్ట్‌, గ్రేడ్‌-2 ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఆఫీస్‌ సబార్డినేట్స్‌ విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

పీహెచ్‌సీల్లో 210 ఖాళీలు...

జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పెద్ద మొత్తంలో ఖాళీలు ఉన్నాయి. వాటిలో ఆయా ఆ సుపత్రుల్లో మెడికల్‌ ఆఫీసర్లు మినహా ఇతర సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. జిల్లాలోని మొత్తం 17 పీహె చ్‌సీల్లో మెడికల్‌ ఆఫీసర్లతో కలిపి మొత్తం 445 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం పొజిషన్‌లో 235 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 210 ఖాళీలు ఉండ గా, ఉన్న సిబ్బందితోనే నెట్టుకు వస్తున్నారు. ఖాళీల వి షయమై భర్తీ కోసం ప్రభుత్వానికి వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య అధికారులు అవసరమైన నివేదికలు అందజేసి నట్లు తెలుస్తోంది. అలాగే జిల్లాలోని మూడు కమ్యూ నిటీ హెల్ట్‌ సెంటర్లకు సంబంధించి 71 పోస్టులు మం జూరు కాగా, వాటిలో ప్రస్తుతం 31 మంది విధుల్లో ఉన్నారు. ఇంకా 40 ఖాళీలు ఉన్నాయి. అర్బన్‌ ప్రైమరీ హెల్ట్‌ సెంటర్లు నాలుగు ఉండగా వాటిలో 73 పోస్టులు మంజూరయ్యాయి. ప్రస్తుతం 64 మంది విధులు ఉం డగా తొమ్మిది ఖాళీలు ఉన్నాయి. అలాగే మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో అనుబంధంగా ఉన్న పీపీ (ఇమ్యూ నైజేషన్‌ అండ్‌ ఫ్యామిలీ ప్లానింగ్‌ సెంటర్‌) యూనిట్‌ కు 02 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు మంజూరు కాగా, పొజిషన్‌లో ఒక్కరు కూడా లేరు. ఎంపీహెచ్‌ఏ (ఎఫ్‌) రెండు పోస్టులకు గాను ఒకరు విధుల్లో ఉన్నా రు. ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌-2 పోస్టు ఒకటి మంజూరు కాగా, అదికూడా ఖాళీగానే ఉంది. ఇదిలా ఉండగా ప్ర భుత్వ జిల్లా ఆసుపత్రిలోని ఆప్తాల్మిక్‌ యూనిట్‌లో సివి ల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టు ఖాళీగా ఉంది. జిల్లాలో నా లుగు బస్తీ దవాఖానాలు ఉండగా 12 పోస్టులు మం జూరయ్యాయి. ఆయా దవాఖానాల్లో పూర్తిస్థాయిలో సి బ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

వైద్య కళాశాలలోనూ అరకొర సిబ్బందే...

జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రితోపాటు మాతా శిశు ఆరోగ్య కేంద్రంలోనూ మంజూరైన పోస్టులకు సరి పడా నియామకాలు లేకపోవడంతో వాటికి అనుంబం ధంగా పని చేస్తున్న వైద్య కళాశాల నుంచి అవసరమై న వైద్యులు, సిబ్బందిని వినియోగిస్తున్నారు. మెడికల్‌ కాలేజీలోనూ సరిపడా సంఖ్య లేకపోవడంతో ప్రజలకు కొంతమేర ఇబ్బందులు తప్పడం లేదు. వైద్య కళాశా లకు 141 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు మంజూరు కా గా, ప్రస్తుతం విధుల్లో 56 మంది ఉన్నారు. మరో 11 మంది కాంట్రాక్టు ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నా రు. ఈ విభాగంలో 74 పోస్టులు భర్తీ కావలసి ఉంది. అలాగే అసోసియేట్‌ ప్రొఫెసర్‌ విభాగంలో 51 పోస్టు లు మంజూరు కాగా ప్రస్తుతం ఇద్దరు మాత్రమే విధు ల్లో ఉండగా, మరో కాంట్రాక్టు ఉద్యోగి విధులు నిర్వహి స్తున్నారు. ఈ విభాగంలో మరో 48 మంది నియామ కం జరగాల్సి ఉంది. ప్రొఫెసర్‌ విభాగంలో 41 పోస్టులు మంజూరు కాగా, విధుల్లో 19 మంది ఉండగా, ఒక్కరు కాంట్రాక్టు పద్దతిలో పని చేస్తున్నారు. ఈ విభాగంలో మరో 21 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నర్సింగ్‌ ఆఫీసర్స్‌ విభాగంలో మొత్తం 354 పోస్టులు మంజూరు కాగా ఈ విభాగంలో మాత్రం పూర్తిస్థాయిలో ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.

డీఎంహెచ్‌వో పోస్టు ఖాళీ....

జిల్లా వైద్య ఆరోగ్యశాఖను ఎప్పటికప్పుడు పర్యవే క్షి స్తూ వైద్యులు, సిబ్బందిని అందుబాటులో ఉండేలా చ ర్యలు తీసుకోవాల్సిన డీఎంహెచ్‌వో (డిస్ట్రిక్ట్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఆఫీసర్‌) పోస్టే ఖాళీగా ఉండటం గమనా ర్హం. గతంలో ఇక్కడ డీఎంహెచ్‌వోగా పని చేసిన డా. హరీష్‌రాజ్‌ ఈ నెల ఒకటవ తేదీన బదిలీ అయ్యారు. 15 రోజులు కావస్తున్నా ఆయన స్థానంలో రెగ్యులర్‌ అ ధికారి నియామకం కాలేదు. దీంతో జిల్లాలో పనిచేస్తు న్న ఓ మెడికల్‌ అధికారికి డీఎంహెచ్‌వోగా అదనపు బాధ్యతలు అప్పగించి విధులు నిర్వహింపజేస్తున్నారు. దీంతో ఆసుపత్రుల పర్యవేక్షణ కొరవడంతో పాటు వై ద్యులు, సిబ్బందిపై అజమాయిషీ పూర్తిస్థాయిలో ఉం డటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. రెగ్యులర్‌ డీఎం హెచ్‌వోను త్వరితగతిన నియమించాలనే అభి ప్రాయా లు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా జిల్లా వైద్యాధికారి కార్యాలయంలోనూ సిబ్బంది కొరత గణనీయం గా ఉంది. ఇక్కడ వివిధ విభాగాలకు సంబంధించి మొత్తం 58 పోస్టులు మంజూరు కాగా కేవలం 29 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. మరో 29 ఖాళీలు దర్శనమిస్తున్నాయి.

Updated Date - Nov 14 , 2025 | 11:12 PM