kumaram bheem asifabad- వరి నారుమడి..యాజమాన్య పద్ధతులు
ABN , Publish Date - Jul 12 , 2025 | 10:33 PM
వానాకాలం సీజన్‌లో వరి సాగుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో రైతాంగం నారుమళ్లను సిద్ధం చేసి మొలక అలుకుతున్నారు. బోర్ల కింద సన్న రకాలైన ఎంటీయూ-1224, 1281, 1282, బీపీటీ, సాంబ మసూరిలతో పాటు పలు ప్రైవేట్ సీడ్స్‌కు సంబంధించి న స్వల్ప కాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక రకాలైన వరి వంగడాలను వేసుకోవడానికి రైతాంగం సిద్ధమైంది.
- విత్తన శుద్ధితో తెగుళ్ల నివారణ
కౌటాల, జూలై 12 (ఆంధ్రజ్యోతి): వానాకాలం సీజన్‌లో వరి సాగుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో రైతాంగం నారుమళ్లను సిద్ధం చేసి మొలక అలుకుతున్నారు. బోర్ల కింద సన్న రకాలైన ఎంటీయూ-1224, 1281, 1282, బీపీటీ, సాంబ మసూరిలతో పాటు పలు ప్రైవేట్ సీడ్స్‌కు సంబంధించి న స్వల్ప కాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక రకాలైన వరి వంగడాలను వేసుకోవడానికి రైతాంగం సిద్ధమైంది. నాణ్యమైన వరి విత్తనాల ఎంపికతో పాటు నారు మడి లో మంచి యజమన్య పద్దతులు, సస్యరక్షణ చర్యలను చేపడితేనే అధిక దిగుబడులు సాధ్యమవుతాయని వ్యవ సాయాధికారులు చెబుతున్నారు. వానాకాలం సాగుకు వరి నారుమళ్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనల ను వ్యవసాయాధికారులు రైతులకు తెలియజేస్తున్నారు.
- ఏకరానికి 30 కిలోల విత్తనాలు..
ఎకరానికి 30 నుంచి 40 కిలోల వరి విత్తనాలు అవస రమవుతాయి. 20 సెంట్ల విస్తీర్ణంలో విత్తనాలు వేసుకో వాలి. 1.5 మీటర్ల వెడల్పుతో ప్లాట్స్ లాగా చేసుకని విత్తనాన్ని వేయా లి. విత్తనం వేసే ముందు కిలో విత్తనానికి 3-4 గ్రాములు కాప్టన్ లేదా థైరంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. దుక్కిలోనే హెక్టర్‌కు 1 టన్ను పశు వుల ఎరువు లేదా సేంద్రియ ఎరువు వేసుకోవాలి. మూ డు కిలోలల భాస్వరం ఇచ్చే ఎరువు, రెండు కిలోలల పోటాస్‌లను వేయా లి. ఈ పద్ధతిలో ముఖ్యంగా ఐరన్, పోటాషియం లోపం కనిపిస్తుంది. దీనిని నివారించుకో వడానికి సూక్ష్మపోషకాలను పిచికారి చేసుకోవాలి.
- నారుమడి తయారీ..
నారు పోయాల్సిన మడిని 10 నుంచి 12 రోజుల్లో మూడు దఫాలుగా దున్ని చదును చేయాలి. నీరు పెట్టేందుకు ఎక్కువైతే తీయడానికి అనుకూలంగా త యారు చేసుకోవాలి. వడ్లను 24 గంటల పాటు నీటిలో నానబెట్టి తీసిన అనంతరం మరో 24 గంటల పాటు మండె కట్టి తరువాత చిన్నగా మొలకత్తిన వడ్ల గింజలను (స్ర్పాడ్స్) దమ్ము చేసిన మడిలో వెదజల్లుతా రు. బోరు బావుల కింద, నీటి వసతి గల భూముల్లో ఈ పద్ధతిని సాగు చేయాలి. కాగా ప్యాడీ ట్రాన్స్‌ప్లాంటర్ (వరి నారు యంత్రం)తో నాట్లు వేయడం కోసం నారు మడిని మ్యాట్లపై వేస్తారు. యంత్రంలో బిగించడానికి అను గుణంగా పొలంలో సన్నపాటి మందం గల మ్యాట్లను పరిచి వాటిపై ఎరువులతో కూడిన మట్టిని వేసి నారును పెంచుతారు. నారు పెరిగిన తరువాత మ్యాట్లను చుట్టి యంత్రాల్లో పెట్టి నాట్లు వేస్తారు. దీని కోసం రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
- సాధారణంగా మూడురకాలు..
వరి నారుమడులు సాధారణంగా మూడురకాలుగా ఉంటాయి. పొడినారుమడి, బురద నారుమడి, మ్యాట్‌పై నారుమడిగా చెబుతారు. మండలంలో ముఖ్యంగా పొడి నారుమడి బురద నారుమళ్లనే ఎక్కువగా ఉపయోగిస్తా రు. పొడి నారుమడి అనగా పొడి దుక్కిలోనే పొడివడ్ల గింజలను వెదజల్లి మట్టిని కప్పుతారు. వర్షపు నీటి ఆధారంతో, బోరుబావుల ద్వారా నీటిని అందించడంతో నారు మొలుస్తుంది. ఈ పద్ధతిని ముఖ్యంగా చెరువులు, కుంటలు, కాలువల కింద మొదట నీటి వసతి లేకుండా వర్షపు నీటిపైనే ఆధారపడే ప్రదేశాల్లో ఉపయోగిస్తారు.
సస్యరక్షణ చర్యలు పాటించాలి..
- ప్రేమలత, వ్యవసాయాధికారి, కౌటాల
నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకొని నారు పోసుకుని సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. వడ్లను ముందే విత్తన శుద్ధి చేసుకుంటే తెగుళ్లను నివారించు కోవచ్చు. నారు మళ్లలో సరైన విధానంగా ప్లాట్స్‌ను తయారు చేసుకుని విత్తనాలు చల్లుకోవాలి.