Share News

kumaram bheem asifabad- యూటర్న్‌ లేక ఇబ్బందులు

ABN , Publish Date - Oct 22 , 2025 | 11:38 PM

మండలం లోని దేవులగూడ వద్ద యూటర్న్‌ను అధికారులు వారం రోజుల క్రితం మూసివేయడంతో వాహనదా రులు ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల-చం ద్రాపూర్‌ జాతీయ రహదారితో రెబ్బెన మండల వాసులకు మెరుగైన రోడ్డు సౌకర్య ఏర్పడినప్పటికీ రెబ్బెన మండలం దేవులగూడ వద్ద యూటర్న్‌ అధికారులు వారం రోజుల క్రితం రాత్రికి రాత్రే మూసివేశారు. దీంతో ఈ గ్రామ ప్రజలతో పాటు అనుసంధాన గ్రామాల ప్రజలకు రోడ్డుకు అటువైపు వెళ్లాలంటే కిలోమీటర్ల దూరం పోవాల్సిన పరిస్థితి నెలకొంది.

kumaram bheem asifabad- యూటర్న్‌ లేక ఇబ్బందులు
దేవుగూడ వద్ద మూసివేసిన యూటర్న్‌

- రాకపోకలకు గ్రామస్థుల అవస్థలు

రెబ్బెన, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): మండలం లోని దేవులగూడ వద్ద యూటర్న్‌ను అధికారులు వారం రోజుల క్రితం మూసివేయడంతో వాహనదా రులు ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల-చం ద్రాపూర్‌ జాతీయ రహదారితో రెబ్బెన మండల వాసులకు మెరుగైన రోడ్డు సౌకర్య ఏర్పడినప్పటికీ రెబ్బెన మండలం దేవులగూడ వద్ద యూటర్న్‌ అధికారులు వారం రోజుల క్రితం రాత్రికి రాత్రే మూసివేశారు. దీంతో ఈ గ్రామ ప్రజలతో పాటు అనుసంధాన గ్రామాల ప్రజలకు రోడ్డుకు అటువైపు వెళ్లాలంటే కిలోమీటర్ల దూరం పోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ గ్రామాల సమీపంలో ఉన్న నంబాల, నారాయణపూర్‌, గంగాపూర్‌, తుంగెడతో పాటు అనేక గ్రామాలకు నేరుగా దేవులగూడ నుంచి ఆసిఫాబాద్‌, మంచిర్యాలకు పోయేందుకు అవకాశం ఉంది. ఈ గ్రామ సమీపంలో ఉన్న యూటర్న్‌ అధి కారులు మూసివేయడంతో ద్విచక్ర వాహనదారులు, ఆటో నడిపే వారు ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామ సమీపం నుంచి యూటర్న్‌ తీసుకోవాంటే కిలోమీటర్ల దూరం వెళ్లి రావాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. నంబాల, నారాయణపూర్‌ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, లారీలకు ఇదే పరిస్థితి. దీంతో వాహనదారులు ఇబ్బందుల పాలవుతున్నారు. దేవులగూడ వద్ద యూటర్న్‌ మూసివేయడంతో మండల కేంద్రంలో ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఏర్పడుతోంది. 12 గ్రామాల ప్రజలు ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే ఈ యూటర్న్‌ ఒక్కసారి మూసివేయడంపై ఆయా గ్రామాల ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం యూటర్న్‌ అందుబాటులో లేక పోవటంతో సర్వీస్‌ రోడ్డు గుండా రెబ్బెనకు వెళుతున్నారు. ఓ వైపు గంగాపూర్‌, నంబాల వైపు నుంచి వచ్చే వాహనాలు రెబ్బెనకు చేరుకోవాలంటే సుమారు 6 కిలోమీటర్ల దూరం వెళ్లి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. 300 మీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రానికి వచ్చేందుకు 6 కిలోమీటర్ల దూరం ప్రయాణించలేక వాహనదారులు రాంగ్‌రూట్‌లో వెళుతున్నారు. దీంతో ట్రాఫిక్‌ సమస్య నిత్యం ఏర్పడుతోంది. ఈ రూట్‌లో భారీ వాహనాలు వెళ్లాలంటే మరింత ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఈ విషయమై సంబంధిత నేషనల్‌ హైవే అధికారులను అడితే స్పష్టమైన సమాధానం రావడం లేదని పలువురు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

మూసివేతతో ఇబ్బందులు పడుతున్నాం..

-శ్రీనివాస్‌, దేవులగూడ

దేవులగూడ వద్ద యూటర్న్‌ మూసివేయడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. రెబ్బెనకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోవాలంటే 6 కిలో మీటర్ల దూరం వెళ్లి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. యూటర్న్‌ ఉంటే కేవలం 2.5 కిలో మీటర్ల దూరంలోనే చేరుకునే అవకాశం ఉండేది. ప్రతి రోజు ఏదో ఒక పనిపై రెబ్బెనకు వెళ్లాల్సి ఉంటుంది. అందరికి ఈ సమస్య ఏర్పడుతోంది. అధికారులు వెంటనే యూటర్న్‌ను పునరుద్ధరించాలి

వెంటనే ప్రారంభించాలి..

- వెంకట స్వామి, దేవులగూడ

రెబ్బెన ఫ్లైఓవర్‌ ఎక్కిన తర్వాత గోలేటి ఎక్స్‌ రోడ్డు వరకు సుమారు కిలో మీటర్‌ దూరం వరకు ఎక్కడ కూడా యూటర్న్‌ లేదు. వాహనాలతో రోడ్డు దాటాలంటే అనవసరం కిలో మీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేవులగూడ వద్ద వెంటనే యూటర్న్‌ను ప్రారంభించాలి. అధికారులు దీనిపై పునరాలోచించి చర్యలు తీసుకోవాలి.

ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది..

-టి.రాజేశ్వర రావు, దేవులగూడ

దేవులగూడ వద్ద యూటర్న్‌ మూసివేయడంతో నిత్యం ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది. అధికారులు వెంటనే యూటర్న్‌ పునఃప్రారంభించాలి. రోడ్డు దాటాలంటే కిలో మీటర్ల దూరం పోవాల్సిన పరిస్థితి ఉంది. దీంతో సమయం వృధా అవుతుంది. అధికారులు ఈ విషయంలో పునరాలోచించి తిరిగి ప్రారంభిస్తే సమస్య పరిష్కారమవుతుంది.

Updated Date - Oct 22 , 2025 | 11:38 PM