Share News

Uttam Kumar Reddy: 22న ఛత్తీస్‌గఢ్‌ సీఎంతో ఉత్తమ్‌ భేటీ

ABN , Publish Date - Sep 20 , 2025 | 05:19 AM

సమ్మక్కసాగర్‌ తుపాకులగూడెం ప్రాజెక్టుకు సంబంధించిన నిరభ్యంతర పత్రం(పై చర్చించేందుకు రావాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి...

Uttam Kumar Reddy: 22న ఛత్తీస్‌గఢ్‌ సీఎంతో ఉత్తమ్‌ భేటీ

హైదరాబాద్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): సమ్మక్కసాగర్‌(తుపాకులగూడెం) ప్రాజెక్టుకు సంబంధించిన నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ)పై చర్చించేందుకు రావాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఛత్తీస్‌గఢ్‌ సీఎంవో కబురు పంపింది. ఈనెల 16లేదా 19న ఛత్తీ్‌సగఢ్‌ సీఎంను కలిసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్‌మెంట్‌ కోరగా.. 22న ఖరారు చేసినట్లు సమాచారం అందింది. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు ఛత్తీ్‌సగఢ్‌ సీఎం విష్ణు దేవ్‌ సాయితో రాయ్‌పూర్‌లో మంత్రి ఉత్తమ్‌ భేటీ కానున్నారు.

హరీశ్‌రావు వ్యాఖ్యలు అర్థరహితం

తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి రూ.35వేల కోట్ల వ్యయం అవుతుందని హరీశ్‌రావు చేసిన ప్రకటపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. హరీశ్‌ది అతితెలివితో కూడుకున్న ప్రకటన అని, ఇందులో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. అన్నింటికి అతితెలివితో వ్యవహరిస్తే ప్రజాక్షేత్రంలో అభాసు పాలవుతారని హితవు పలికారు.

Updated Date - Sep 20 , 2025 | 05:19 AM