kumaram bheem asifabad- తపాలా శాఖ సేవలు వినియోగించుకోవాలి
ABN , Publish Date - Oct 16 , 2025 | 10:25 PM
నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులను తపాలా శాఖ ద్వారా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎలకో్ట్రరల్ అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర ముఖ్య ఎలకో్ట్రరల్ అధికారి కార్యాలయం నుంచి గురువారం ఇతర అధికారులతో కలిసి వీసీ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్‌లు, సహయ ఎన్నికల అధికారులు, తహసీల్దార్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులను తపాలా శాఖ ద్వారా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎలకో్ట్రరల్ అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర ముఖ్య ఎలకో్ట్రరల్ అధికారి కార్యాలయం నుంచి గురువారం ఇతర అధికారులతో కలిసి వీసీ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్‌లు, సహయ ఎన్నికల అధికారులు, తహసీల్దార్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎలకో్ట్రరల్ అధికారి మాట్లాడుతూ నూతనంగా ఓటర్లుగా నమోదైన ప్రతి ఒక్కరికి తపాలా శాఖ ద్వారా ఓటరు గుర్తింపు కార్డులను పంపిణీ చేయాలని తెలిపారు. ఓటరు జాబితాలో 100 సంవత్సరాల వయస్సు కలిగిన ఓటర్లను గుర్తించి వారి వయస్సును తగిన ఆధారాలతో సమర్పించాలని చెప్పారు. బూత్ స్థాయి అధికారులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని అన్నారు. ఫారం 6, 7, 8 దరఖాస్తులను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నూతనంగా ఓటరుగా నమోదైన వారికి తపాలాశాఖ ద్వారా ఓటరు గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఓటరు జాబితాలో 100 సంవత్సరాల వయస్సు పైబడిన ఓట ర్లను గుర్తించి వారి నిజ వయస్సు ఆధారంగా సవరించడానికి చర్యలు తీసుకుం టామని అన్నారు. జిల్లాలో సిర్పూర్, ఆసిపాబాద్ నియోజక వర్గాలలో గల బూత్ స్థా యి అధికారులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేసేందుకు చర్యలు తీసు కుంటు న్నామని అన్నారు. పెండింగ్‌లో గల ఫారం-6, 7, 8 దరఖాస్తులు పరిష్కా రానికి చర్య లు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎన్నికల పర్యవేక్షకులు శ్యాంలాల్ తదితరులు పాల్గొన్నారు.