Minister Komatireddy Venkata Reddy: దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతు చేయాలి
ABN , Publish Date - Sep 30 , 2025 | 05:34 AM
వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత దెబ్బ తిన్న రోడ్లకు తాత్కాలిక మరమ్మతు పనులు చేపట్టాలని తన శాఖ అధికారులను రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఆదేశించారు....
సీఎం రేవంత్‌తో మాట్లాడి హ్యామ్ విధానం తెస్తాం
రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత దెబ్బ తిన్న రోడ్లకు తాత్కాలిక మరమ్మతు పనులు చేపట్టాలని తన శాఖ అధికారులను రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఆదేశించారు. శాశ్వత పనులు చేపట్టడానికి మరోమారు క్షేత్రస్థాయిలో సర్వే జరపాలని సూచించారు. తన శాఖ పరిధిలోని రోడ్ల పురోగతిపై సోమవారం ఆయన అధికారులతో సమీక్షించారు. ఇటీవల కురిసిన వర్షాలతో 1,062 ప్రాంతాల్లో 1,370 కి.మీ పరిధిలో రోడ్లు దెబ్బ తినగా, కొన్ని చోట్ల కోతకు గురయ్యాయని మంత్రికి ఈఎన్‌సీ మోహన్‌నాయక్ వివరించారు. వాటి తాత్కాలిక మరమ్మతు పనులకు రూ.72 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు రూ.1,263 కోట్లు అవసరమన్నారు. నిర్ణీత గడువులోగా టిమ్స్‌లను పూర్తి చేయాలని అధికారులను మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. కరీంనగర్, ములుగు, వరంగల్ కలెక్టరేట్ల నిర్మాణం పూర్తి చేయడంతోపాటు నారాయణపేట, ఆదిలాబాద్ కలెక్టరేట్‌ల పనుల్లో వేగం పెంచి త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. ఎన్నికల్ కోడ్ ముగిశాక పూర్తిస్థాయిలో సమీక్షిస్తానని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి హ్యామ్ రోడ్లపై ఒక స్పష్టమైన విధానాన్ని తెస్తామని అధికారులకు మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. ఈ సమీక్షలో చీఫ్ ఇంజినీర్లు రాజేశ్వరరెడ్డి, బీవీ రావు, లక్ష్మణ్, శ్రీనివాసరెడ్డి, కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు.