Share News

Tummala Nageswara Rao: యూరియా సరఫరా పెరుగుతుంది

ABN , Publish Date - Sep 08 , 2025 | 02:58 AM

రాష్ట్రవ్యాప్తంగా సాగుకు అవసరమైన యూరియాను పూర్తిస్థాయిలో సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, రైతులు ఆందోళన చెందొద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Tummala Nageswara Rao: యూరియా సరఫరా పెరుగుతుంది

  • కేంద్రానికి సీఎం విజ్ఞప్తితో కదలిక: తుమ్మల నాగేశ్వరరావు

అశ్వారావుపేట, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా సాగుకు అవసరమైన యూరియాను పూర్తిస్థాయిలో సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, రైతులు ఆందోళన చెందొద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతర్జాతీయంగా, దేశీయంగా ఉన్న అనేక పరిస్థితుల నేపథ్యంలో యూరియా సరఫరాలో, కొంత మేర కేటాయింపుల్లో ఆలస్యం జరిగిందని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి యూరియా ప్రణాళికకు అనుగుణంగా కేటాయింపు ఇవ్వాలని కేంద్రానికి లేఖ ద్వారా, స్వయంగాను కలిసి విన్నవించారని తెలిపారు. రాష్ట్రప్రభుత్వ కృషి ఫలితంగా ఆగస్టులో కేంద్రం నుంచి అదనంగా 40వేల మెట్రిక్‌ టన్నుల యూరియా వచ్చిందని చెప్పారు. ఇకనుంచి ప్రతీ రోజు 8వేల నుంచి 10వేల మెట్రిక్‌ టన్నుల యూరియా వివిధ కంపెనీల ద్వారా సరఫరా అవుతుందన్నారు.

Updated Date - Sep 08 , 2025 | 02:58 AM