యూరియాను ఎమ్మార్పీకే విక్రయించాలి
ABN , Publish Date - Aug 20 , 2025 | 11:24 PM
యూరియాను ఎమ్మార్పీ ధరకే విక్రయించాలని ఫర్టిలైజర్ డీలర్లను జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు ఆదేశించారు.
- జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్‌రావు
ఊర్కొండ, ఆగస్టు 20 (ఆంధ్రజ్యో తి) : యూరియాను ఎమ్మార్పీ ధరకే విక్రయించాలని ఫర్టిలైజర్ డీలర్లను జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు ఆదేశించారు. బుధవారం మం డల కేంద్రంలోని ఆగ్రో రైతు సేవ కేం ద్రం, శ్రీ ఆంజనేయస్వామి ట్రెడర్స్‌తో పాటు మాదారం గ్రామంలోని తెలం గాణ ఆగ్రో ఏజెన్సీ, రాఘవేంద్ర ట్రెడర్స్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఆయన మాట్లాడుతూ రైతులకు సరిపడా యూరియా ఉందని, ఎవరూ ఆందోళన చెందా ల్సిన పనిలేదన్నారు. ఫర్టిలెజర్ డీలర్లు షాపుల వద్ద స్టాక్ బోర్డులు పెట్టాలని రోజువారీగా అ ప్డేట్ చేయాలని సూచించారు. మండలంలో గ తేడాది వర్షాకాలంలో రైతులు 151మెట్రిక్ టన్నుల యూరియా వినియోగిస్తే, ఈసారి 427మెట్రిక్ టన్నుల యూరియాను రైతులు వినియోగించారని తెలిపారు. కల్వకుర్తి ఏడీఏ కిరణ్‌కుమార్, ఏవో అధికారి దీప్తి ఉన్నారు.