Share News

Urea Availability Rises: రాష్ట్రంలో యూరియా లభ్యత పెరిగింది

ABN , Publish Date - Sep 06 , 2025 | 03:22 AM

రాష్ట్రంలో యూరియా లభ్యత పెరిగిందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గడిచిన నాలుగు రోజుల్లో..

Urea Availability Rises: రాష్ట్రంలో యూరియా లభ్యత పెరిగింది

  • రైతులు ఆందోళన చెందొద్దు : మంత్రి తుమ్మల

  • రైతు వేదికల వద్ద అదనపు కౌంటర్ల ఏర్పాటుకు ఆదేశం

హైదరాబాద్‌, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో యూరియా లభ్యత పెరిగిందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గడిచిన నాలుగు రోజుల్లో రాష్ట్రానికి 28 వేల టన్నుల యూరియా వచ్చిందని, ఈ లెక్కన వచ్చే 20 రోజుల పాటు రోజుకు 10 వేల టన్నుల చొప్పున 2 లక్షల టన్నుల యూరియా సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. శుక్రవారం 11,181 టన్నుల యూరియా రాష్ట్రానికి చేరిందని, శనివారం మరో 9,039 టన్నులు వస్తుందని చెప్పారు. సచివాలయంలో వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో మంత్రి తుమ్మల శుక్రవారం సమీక్ష నిర్వహించారు. యూరియా సరఫరా పెరుగుతున్న నేపథ్యంలో గ్రామాల్లో రైతువేదికల వద్ద అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. యూరియా దిగుమతి కాకపోవటం, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ మూతపడటంతో అదనంగా 30 వేల టన్నులు రాష్ట్రానికి కేటాయించటానికి కేంద్రం అంగీకరించినట్లు తుమ్మల తెలిపారు. రాష్ట్రంలో ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8,20,112 టన్నుల యూరియా విక్రయాలు జరిగాయని, గత సంవత్సరం ఇదే సమయానికి 7,75,157 టన్నుల అమ్మకాలు మాత్రమే జరిగాయని తెలిపారు.

Updated Date - Sep 06 , 2025 | 03:22 AM