Share News

పట్టణ ప్రణాళికను అమలు చేయాలి

ABN , Publish Date - Jul 30 , 2025 | 11:25 PM

మున్సిపాలిటిల్లో వంద రోజుల పట్టణ ప్రగతి ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని మునిసిపల్‌ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ అన్నారు.

పట్టణ ప్రణాళికను అమలు చేయాలి
దేవరకొండ పార్క్‌లో మునిసిపల్‌ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌

దేవరకొండ, జూలై 30(ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటిల్లో వంద రోజుల పట్టణ ప్రగతి ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని మునిసిపల్‌ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ అన్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండ మునిసిపల్‌ కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. డంపింగ్‌యార్డు నిర్వాహణ, శానిటేషన్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు. 2024-25 సంవత్సరానికి స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రంలో దేవరకొండ మునిసిపాలిటీ 21వ ర్యాంక్‌ సాధించడం అభినందనీయమన్నారు. అనంతరం దేవరకొండ ఖిల్లాలోని పార్కును సందర్శించి మొక్కలునాటారు. ఆయన వెంట మునిసిపల్‌ కమిషనర్‌ సుదర్శన్‌, ఏఈ రాజు, శానిటరి ఇన్‌స్పెక్టర్‌ సురిగి శంకర్‌, మేనేజర్‌ రాకేష్‌, అధికారులు ఉన్నారు.

రామగిరి: నల్లగొండ పట్టణంలో ఉన్న ప్రతి ఇంటికీ అసె్‌సమెం ట్‌చేసి ఆస్తి పన్ను పెంపునకు కృషి చేయాలని మునిసిపల్‌ జాయి ంట్‌ డైరెక్టర్‌ బోనగిరి శ్రీనివాస్‌ అన్నారు. 100రోజుల ప్రణాళికలో భాగంగా బుధవారం పట్టణంలోని డంపింగ్‌ యార్డు, వివిధ వార్డుల్లో పర్యటించారు. అనంతరం కార్యాలయంలో మహిళా సంఘాలు, వార్డు ఆఫీసర్లు, ఆఫీస్‌ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అసె్‌సమెంట్‌ ఉండి ట్రేడ్‌ లైసెన్స్‌ లేని వాణిజ్య సంస్థలు కూడా గుర్తించాలన్నారు. ఆన్‌లైన్‌లో ఉన్న నల్లా కనెక్షన్లు, గృహ నిర్మాణ సంఖ్యను చూసి ఆశ్చర్య వ్యక్తం చేశారు. ప్రతి ఇంటి నల్లా కనెక్షన్‌ను ఆన్‌లైన్‌ చేయాలన్నారు. ఫాంలాండ్‌ వెంచర్లలో అనుమతులులేని నిర్మాణాలపై దృష్టిసారించాలన్నారు. సమావేశంలో మునిసిపల్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ రవీందర్‌రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్‌ శివరాంరెడ్డి, ప్రదీప్‌రెడ్డి, గడ్డం శ్రీనివాస్‌ ఉన్నారు.

Updated Date - Jul 30 , 2025 | 11:25 PM