Share News

అకాల వర్షం.. రైతుకు నష్టం

ABN , Publish Date - May 01 , 2025 | 12:41 AM

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బుధవారం కురిసిన అకాల వర్షం రైతులకు నష్టం మిగిల్చింది.

అకాల వర్షం.. రైతుకు నష్టం
సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో తడిసిన ధాన్యం

తిరుమలగిరి, ఏప్రిల్‌ 30(ఆంద్రజ్యోతి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బుధవారం కురిసిన అకాల వర్షం రైతులకు నష్టం మిగిల్చింది. నోటికాడికి వచ్చిన ముద్ద నేలపాలు కావడంతో అన్నదాతలు ఆవేదన చెందారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో బుధవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఉన్నా సాయంత్రం నాలుగు గంటల సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఈదురుగాలులతో కూడిన వర్షంతో కొనుగోలు కేంద్రాలు, మార్కెట్‌లో ధాన్యం తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు టార్పాలిన్లు అందుబాటులో లేకపోవడంతో చాలా మంది రైతుల ధాన్యం తడిసి వరదలో కొట్టుకుపోయింది. తడిసిన ధాన్యాన్ని తరగు లేకుండా ప్ర భు త్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

ఐకేపీ కేంద్రాల్లో తడిసిన ధాన్యం

నాగారం: నాగారం మండలంలో బుధవారం కురిసిన ఆకాల వర్షానికి ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది. ధాన్యం ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం పోసి నెలరోజులు దాటినా జిల్లాలో మి ల్లుల ఆలాట్‌మెంట్‌ ఆలస్యం కావడంతో ధాన్యం కోనుగోలు రోజురోజుకు ఆలస్యమతువున్నాయని ఐకేపీ నిర్వాహకులు తెలిపారు. సకాలంలో మిల్లులను సెంటర్లకు అలాట్‌ చేసి ఉంటే ధాన్యం కోనుగోలు 90శాతానికి పైగా పూర్తియ్యేవని రైతు లు వాపోతున్నారు. అధికారులు స్పందించి త్వరగా మిల్లుకు ధాన్యం తరలించేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరతున్నారు.

ఉరుములు.. మెరుపులు

దేవరకొండ: దేవరకొండలో బుధవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కొన్ని నెలలుగా ఎండవేడిమికి అల్లాడుతున్న పట్టణ ప్రజలు చిరు జల్లులతో కూడిన వర్షం కురవడంతో కొంత ఊరట చెందారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో పట్టణం లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

పిడుగుపాటుకు రెండు ఎద్దులు మృతి

డిండి: మండలంలోని బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన జబ్బు పెద్దయ్యకు చెందిన రెండు ఎద్దులు పిడుగుపడి బుధవారం మృతి చెందాయి. గ్రామానికి చెందిన జబ్బు పెద్దయ్య తన రెండు ఎడ్లను వ్యవసాయబావి వద్ద చెట్టుకు కట్టేసి ఉంచాడు. సాయంత్రం సమ యంలో ఉరుములు, మెరుపులు, ఈదరుగాలులతో కూడిన వర్షానికి పిడు గుపడి రెండు ఎద్దులు మృతిచెందాయి. ఎద్దుల విలువ సుమారు రూ. లక్షకుపైగా ఉంటుందని బాధితుడు తెలిపాడు. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఆయన కోరాడు.

సకాలంలో ఎగుమతులు కాక..

డిండి మండలంలో బుధవారం కురిసిన అకాల వర్షానికి ధాన్యం కొ నుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసింది. డిండి మండల కేం ద్రంలోని మార్కెట్‌యార్డులో ఆరబోసిన ధాన్యంలోకి వర్షపునీరు చేరి తడి సిపోయింది. టార్పాలిన్లు ధాన్యం వర్షానికి తడవకుండా కాపా డుకోలేకపో యామని రైతులు ఆవేదన చెందారు. లారీలు రాకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పేరుకుపోయాయి. ప్రతిరోజూ కేంద్రానికి ఒక లారీ మాత్రమే వస్తుందని రైతులు తెలిపారు. కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు అధికారులు కల్పించలేదని రైతులు ఆరోపిస్తున్నారు.

శాలిగౌరారంలో భారీ వర్షం

శాలిగౌరారం: మండల కేంద్రంలోతో పాటు పలుగ్రామాల్లో బుధవారం సాయంత్రం భారీ ఈదురు గాలులు మెరుపులతో మోస్తరు వర్షం కురి సింది. మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయిన ప్రజలకు సాయంత్రం కురిసిన వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. భారీ ఈదురు గాలులతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది.

Updated Date - May 01 , 2025 | 12:41 AM