Share News

దేవరకొండ డివిజనలో ఆగని నల్లబెల్లం, పటిక అక్రమ రవాణా

ABN , Publish Date - Jul 28 , 2025 | 12:56 AM

దేవరకొండ డివిజనలోని తండాలు, గ్రామాల్లో టాస్క్‌ఫోర్స్‌, ఎనఫోర్స్‌మెంట్‌, దేవరకొండ ఎక్సైజ్‌ పోలీసులు దాడులు చేస్తున్నా నల్లబెల్లం, పటిక అక్రమరవాణా ఆగడం లే దు.

 దేవరకొండ డివిజనలో ఆగని నల్లబెల్లం, పటిక అక్రమ రవాణా
చందంపేట మండలంలో నాటుసారా తయారు చేసే బెల్లం పానకాన్ని ధ్వంసం చేస్తున్న పోలీసులు (ఫైల్‌)

దేవరకొండ డివిజనలో ఆగని నల్లబెల్లం, పటిక అక్రమ రవాణా

జోరుగా నాటుసారా విక్రయాలు

దాడులు చేస్తున్నా ఆగని దందా

కఠినచర్యలు తీసుకుంటామని అధికారుల హెచ్చరిక

దేవరకొండ, జూలై 27(ఆంధ్రజ్యోతి): దేవరకొండ డివిజనలోని తండాలు, గ్రామాల్లో టాస్క్‌ఫోర్స్‌, ఎనఫోర్స్‌మెంట్‌, దేవరకొండ ఎక్సైజ్‌ పోలీసులు దాడులు చేస్తున్నా నల్లబెల్లం, పటిక అక్రమరవాణా ఆగడం లే దు. గ్రామాలు, తండాల్లో నాటుసారా విక్రయాలు పె రుగుతూనే ఉన్నాయి. వర్షాకాలం కావడంతో నాటుసారా తయారీపై కొంతమంది వ్యాపారులు దృష్టి సా రించి ఉపాధి పొందుతున్నారు. లాభదాయకంగా ఉం డటంతో అధిక ఉత్పత్తి చేస్తుండటంతో ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.

ఈ ఏడాది జనవరి నుంచి దేవరకొండ ఎక్సైజ్‌ పోలీసులు సర్కిల్‌ పరిధిలో నాటుసారా విక్రయదారులపై 250 కేసులు నమోదు చేశారు. 202 మందిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపించారు. 845 లీట ర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. నల్లబెల్లం 735 కిలోలు, 375 కేజీల పటిక, 48 వాహనాలు సీజ్‌ చేయడంతో పాటు 18950 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. దీనిని బట్టి చూస్తే డివిజనలో నా టుసారా విక్రయాలు ఏ విధంగా జరుగుతున్నాయనేది తెలుస్తుంది. నాటుసారా వ్యాపారం లాభదాయకంగా ఉండటం, లీటర్‌ సారా రూ.150 నుంచి 200 వరకు విక్రయిస్తున్నారు. సారా తయారీకి కావాల్సిన నల్లబెల్లం పౌడర్‌, పటికలను హైదరాబాద్‌ పటానచెరువు నుంచి వాహనాల్లో తీసుకువస్తున్నట్లు సమాచారం. డివిజన పరిధిలోని చందంపేట, డిండి, నేరేడుగొమ్ము, పీఏపల్లి, గుడిపల్లి, చింతపల్లి, దేవరకొండ మండలాల్లో నాటుసారా విక్రయాలు జరుగుతున్నా యి. చందంపేట మండలం కంభాలపల్లి, పొగిళ్ల తండాల నుంచి ఆంధ్రప్రదేశలోని మాచర్లకు కూడా మర పడవలలో నాటుసారా తరలివెళ్తుంది. దేవరకొండ ఎక్సైజ్‌ అధికారులతో పాటు జిల్లా టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడులు చేస్తున్నారు. కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నా నాటుసారా విక్రయాలు, నల్లబెల్లం, పటిక అక్రమ రవాణా ఆగడం లేదు. పీడీయాక్టుతో పాటు నాటుసారా విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటేనే విక్రయాలు అదుపులోకి వస్తాయని పలువురు సూచిస్తున్నారు. ఎక్సైజ్‌ పోలీసులతోపాటు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి నాటుసారా విక్రయాలను అరికట్టడానికి కఠినచర్యలు తీసుకోవా ల్సి ఉంది. నాటుసారా తాగడం వల్ల అనేక అనర్థాలు జరుగుతాయని, ఆరోగ్యం దెబ్బతింటుందని డాక్టర్లు, వైద్యాధికారులు చెబుతున్నా నాటుసారా తక్కువ ధర కు లభిస్తుండటంతో సారా వైపే మొగ్గు చూపుతూ దానికి బానిసలవుతున్నారు.

దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నాం

నాటుసారా తయారీదారులపై నిఘా ఏర్పాటు చేశాం. జిల్లా టా స్క్‌ఫోర్స్‌, దేవరకొండ సర్కిల్‌ పో లీసులు దాడులు నిర్వహించి నల్లబెల్లం, పటికలను స్వాధీనం చేసుకోవడంతో పాటు నాటుసారా కేంద్రాలపై దాడులు చే స్తూనే ఉన్నాం. ఏడాదిలో రెండు పర్యాయాలకుపైగా నల్లబెల్లం, పటిక సారాతో పట్టుబడితే పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తాం. ప్రజలు సహకరించాలి.

- శ్రీనివాస్‌, ఎక్సైజ్‌ సీఐ, దేవరకొండ

Updated Date - Jul 28 , 2025 | 12:56 AM