kumaram bheem asifabad- జమకాని వంట గ్యాస్ రాయితీ
ABN , Publish Date - Jul 05 , 2025 | 11:00 PM
మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వంట గ్యాస్ రాయితీ డబ్బులు జమ కావడం లేదు. పేద, మధ్య తరగతి కుటుంబాల్లో కొన్నేళ్లుగా వంట గ్యాస్ సిలిండర్ల భారం మోయలేనంతగా మారింది. దీంతో సామాన్యులకు ఊరట కలిగించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ రూ. 500లకే సిలిండర్ ఇస్తామని ఎన్నికల్లో ప్రక టించింది. అధికారంలోకి రాగానే గత ఏడాది ఫిబ్రవరి నుంచి మహాలక్ష్మి పథకంలో భాగంగా రాయితీ రూపంలో రూ. 500లకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నారు. ఇంత వరకు బాగున్నా.. మూడు నెలల నుంచి అర్హులకు గ్యాస్ రాయితీ రావడం లేదని చెబుతున్నారు.
జైనూర్, జూలై 5 (ఆంధ్రజ్యోతి): మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వంట గ్యాస్ రాయితీ డబ్బులు జమ కావడం లేదు. పేద, మధ్య తరగతి కుటుంబాల్లో కొన్నేళ్లుగా వంట గ్యాస్ సిలిండర్ల భారం మోయలేనంతగా మారింది. దీంతో సామాన్యులకు ఊరట కలిగించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ రూ. 500లకే సిలిండర్ ఇస్తామని ఎన్నికల్లో ప్రక టించింది. అధికారంలోకి రాగానే గత ఏడాది ఫిబ్రవరి నుంచి మహాలక్ష్మి పథకంలో భాగంగా రాయితీ రూపంలో రూ. 500లకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నారు. ఇంత వరకు బాగున్నా.. మూడు నెలల నుంచి అర్హులకు గ్యాస్ రాయితీ రావడం లేదని చెబుతున్నారు. దీంతో ఆర్థిక భారం భారం తప్పడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు.
జిల్లా వ్యాప్తంగా..
జిల్లా వ్యాప్తంగా 12 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో సుమారు 1.80 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. నిత్యం సుమారు మూడు వేల గ్యాస్ సిలిండర్లు అవసరం అవుతుండగా పూర్తి ధర చెల్లిస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ మహాలక్ష్మి పథకం ద్వారా రు. 500లకు ఆదనంగా చెల్లించిన పైసలు రాయితీ రూపంలో లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నారు. కానీ సిలిండర్ తీసుకుని నెల రెండు నెలలు గడుస్తున్నప్పటికీ లబ్దిదారుల ఖాతాలో రాయితీ డబ్బులు జమ కావడం లేదని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. వినియోగదారుల నంబరు ఆన్‌లైన్‌లో నమోదు చేసే క్రమంలో అవక తవకలు జరుగుతున్నాయా..?లేక ప్రభుత్వ నుంచి రాయితీ జమకావడం లేదా..? అని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. రాయితీల కోసం ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే పెరుగుతున్న నిత్యావసరకుల ధరల తో ఇబ్బందులు పడుతున్నామని, పేద కుటుంబాలకు గ్యాస్ రాయితీ సక్రమంగా అందేలా చూడాలని పలువురు లబ్ధిదారులు కోరుతున్నారు.
రాయితీ డబ్బులు రావడం లేదు..
రంజనాబాయి, కాలేజీగూడ
సిలిండర్ తీసుకున్నా పూర్తి స్థాయిలో రాయితీ డబ్బులు రావడం లేదు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాయితీ డబ్బులు పడడం లేదు. కేవలం 57 రూపా యల రాయితీ మాత్రమే వస్తుంది. ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకోవాలి.
ఏడాదిగా జమ కావడం లేదు..
- విమలాబాయి, పవర్‌గూడ
ఏడాది కాలంగా రాయితీ డబ్బులు జమ కావడం లేదు. పూర్తి డబ్బులు చెల్లించి వంట గ్యాస్ కొనుగోలు చేస్తున్నాం. గ్యాస్ తీసుకున్న ప్రతి సారి రాయతీ డబ్బులు వస్తాయని ఆశతో ఎదురు చూస్తున్నప్పటికీ ఖాతాలో జమ కావడం లేదు. బ్యాంక్, గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి ఆరా తీస్తున్నా ఎవరు సరైన సమాధానం చెప్పడం లేదు.