University of Hyderabad: తెలంగాణ విద్యాసంస్థల్లోహెచ్‌సీయూ టాప్
ABN , Publish Date - Nov 14 , 2025 | 04:41 AM
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ 2026లో మెరిసింది. ఆసియాలోని యూనివర్సిటీలన్నింటిలో హెచ్‌సీయ...
క్యూఎస్ ఆసియా ర్యాంకింగ్స్‌లో 246వ ర్యాంక్
హైదరాబాద్ సిటీ, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ 2026లో మెరిసింది. ఆసియాలోని యూనివర్సిటీలన్నింటిలో హెచ్‌సీయూకు 246వ ర్యాంకు దక్కించుకోగా దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో 5వ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో అగ్రస్థాయి విద్యాసంస్థగా హెచ్‌సీయూ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ బీజేరావు మాట్లాడుతూ, విద్యా నైపుణ్యం, వినూత్న పరిశోధనకు క్యూఎస్ ర్యాంకింగ్స్‌ను అత్యుత్తమ గుర్తింపుగా భావిస్తున్నామన్నారు. ఆవిష్కరణ, వైవిధ్యానికి విశ్వవిద్యాలయం కేంద్రంగా నిలిచిందని, ప్రపంచవ్యాప్తంగా ప్రభావాన్ని చూపే ఆలోచనాపరులు, సృష్టికర్తలు, నాయకులను పెంపొందిస్తోందని చెప్పారు.