Share News

kumaram bheem asifabad- శ్రామిక మహిళ హక్కుల కోసం ఐక్య పోరాటాలు

ABN , Publish Date - Aug 03 , 2025 | 10:49 PM

శ్రామిక మహిళ హక్కుల కోసం ఐక్య పోరాటాలకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని శ్రామిక మహిళ రాష్ట్ర కన్వీనర్‌ ఎస్‌వీ రమ అన్నారు. కాగజ్‌నగర్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. డిసెంబరు 7, 8, 9 తేదీల్లో సీఐటీయూ ఐదు రాష్ట్ర మహాసభలు మెదక్‌ జిల్లాలో నిర్వహించనున్నామని అన్నారు. ఈ నేపథ్యంలో మహిళ కార్మికుల సమస్యలపై చర్చించి భవిష్యత్తు కర్తవ్యాలను నిర్ణయించుకునేందుకు సమన్వయ కమిటీ రాష్ట్ర సదస్సు అక్టోబరు 5, 6 తేదీల్లో కాగజ్‌నగర్‌లో నిర్వహిస్తామని తెలిపారు

kumaram bheem asifabad- శ్రామిక మహిళ హక్కుల కోసం ఐక్య పోరాటాలు
మాట్లాడుతున్న శ్రామిక మహిళ రాష్ట్ర కన్వీనర్‌ రమ

కాగజ్‌నగర్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): శ్రామిక మహిళ హక్కుల కోసం ఐక్య పోరాటాలకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని శ్రామిక మహిళ రాష్ట్ర కన్వీనర్‌ ఎస్‌వీ రమ అన్నారు. కాగజ్‌నగర్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. డిసెంబరు 7, 8, 9 తేదీల్లో సీఐటీయూ ఐదు రాష్ట్ర మహాసభలు మెదక్‌ జిల్లాలో నిర్వహించనున్నామని అన్నారు. ఈ నేపథ్యంలో మహిళ కార్మికుల సమస్యలపై చర్చించి భవిష్యత్తు కర్తవ్యాలను నిర్ణయించుకునేందుకు సమన్వయ కమిటీ రాష్ట్ర సదస్సు అక్టోబరు 5, 6 తేదీల్లో కాగజ్‌నగర్‌లో నిర్వహిస్తామని తెలిపారు. ఆగస్టు 3న ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్టు వివరించారు. మహిళ కార్మికులను సంఘటితం చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. కార్మిక వర్గం అన్ని విధాల సహాయ సహాకారాలు అందజేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర యూటీ ఎఫ్‌ రాష్ట్ర నాయకులు, జిల్లా అధ్యక్షురాలు శాంతికుమారి మాట్లాడుతూ ఉద్యోగ, కార్మిక ఉపాధ్యాయుల ఐక్యతకి యూటీఎఫ్‌ కట్టుబడి ఉన్నదని తెలిపారు. శ్రామిక మహిళ సదస్సును విజయవంతం చేయాలని కోరారు. సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగురు రాములు మాట్లాడుతూ శ్రామిక మహిళ రాష్ట్ర సదస్సును నిర్వహించడనికి ముందుకు వచ్చిన కుమురంభీం జిల్లా సీఐటీయూ నాయకత్వానికి కృతజ్ఙతలు తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్‌, మహిళ సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ త్రివేణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 03 , 2025 | 10:49 PM