విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన అవసరం
ABN , Publish Date - Jul 22 , 2025 | 11:58 PM
విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన అవసరమని చెన్నూరు కోర్టు సివిల్ జడ్జి పి. రవి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, తల్లి గర్భం నుంచి భూగర్భంలోకి వెళ్లేంత వరకు ప్రతి ఒక్కరిపై చట్టాల ప్రభావం ఉంటుంద న్నారు.
కోటపల్లి, జూలై 22 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన అవసరమని చెన్నూరు కోర్టు సివిల్ జడ్జి పి. రవి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, తల్లి గర్భం నుంచి భూగర్భంలోకి వెళ్లేంత వరకు ప్రతి ఒక్కరిపై చట్టాల ప్రభావం ఉంటుంద న్నారు. లింగనిర్ధారణ పరీక్షలను నేరాలుగా భావించడం జరుగుతుందని దీంతోనే గర్భంలో శిశువు ఉన్న ప్పటి నుంచే చట్టాల రక్షణ కనబడుతుందన్నారు. మనిషి సాధించాలనుకుంటే ప్రయత్నం చేస్తే కానిది ఏది లేదని, జీవితంలో చదువు ముఖ్యమని, చదువుతోనే జీవితాల్లో మార్పు వస్తుందన్నారు. హక్కులు, చట్టాలు, ఆర్టికల్ 19 ప్రకారం స్వేచ్చగా మాట్లాడుకునే హక్కులు, పేద ప్రజలకు ఉచిత న్యాయ సలహాలు, లోక్ అదాలత్ తదితర అంశాలపై ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు రూరల్ సీఐ బన్సీలాల్, పోక్సో కోర్టు స్పెషల్ పబ్లిక్‌ప్రా సిక్యూటర్ రాంబాబు, ఎస్‌ఐ రాజేందర్, న్యాయవాదులు మహేష్, పున్నం, రాజేష్,నాగులు, వ్యవసాయాధికారి సాయికృష్ణరెడ్డి, పంచాయతీ కార్యదర్శి సందీప్, సీనియర్ ఉపాధ్యా యుడు సలీం, గ్రామయువకులు, కస్తూర్బా విద్యార్ధినీలు పాల్గొన్నారు.