Share News

అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు త్వరితగతిన పూర్తిచేయాలి

ABN , Publish Date - Aug 09 , 2025 | 12:44 AM

నల్లగొండ పట్టణంలో నిర్మిస్తున్న అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు నాణ్యతా ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి డిమాండ్‌ చేశారు.

 అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు త్వరితగతిన పూర్తిచేయాలి
నీటిశుద్ధి కేంద్రాన్ని పరిశీలిస్తున్న సీపీఎం జిల్లా కార్యదర్శి వీరారెడ్డి

అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు త్వరితగతిన పూర్తిచేయాలి

నల్లగొండ రూరల్‌, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): నల్లగొండ పట్టణంలో నిర్మిస్తున్న అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు నాణ్యతా ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి డిమాండ్‌ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన సమస్యల పై సర్వే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని శేషమ్మగూడెం మూడవ వార్డులో నిర్మించి మురుగు నీరు శుద్ధి కేంద్రాన్ని పట్టణ కమిటీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా వీ రారెడ్డి మాట్లాడుతూ నల్లగొండ పట్టణంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు 2008 ప్రారంభించి ఇప్పటి వరకు పూర్తి చేయలేదని ఆరోపించారు. మురుగు నీరు శుద్ధి కేంద్రాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని కోరారు. పానగల్‌, పెద్దబండ లాంటి ముఖ్యమైన ప్రాంతాలను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల కోసం ఇళ్లు లేని ప్రాంతాల్లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టారని వివమర్శించారు. కొన్ని ప్రాంతాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, ఎగుడుదిగుడుగా పైప్‌ లైన్లు వేస్తూ క్యూరింగ్‌ లేని మ్యానహోల్‌లను నిర్మిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీ ఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు సయ్యద్‌ హాషం, నాయకులు ఎండీ సలీం, దండెంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, రవీందర్‌, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Aug 09 , 2025 | 12:44 AM