ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు
ABN , Publish Date - Jun 20 , 2025 | 11:09 PM
సమాజంలో వందేళ్లుగా ఓట్లు, సీట్లు, అధికారం తో సంబంధం లేకుండా నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజాసమస్యల పరి ష్కారానికై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తున్న ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీయేనని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.బాలనరసింహ వెల్లడిం చారు.
- సీపీఐ మండల మహాసభలో జిల్లా కార్యదర్శి బాలనరసింహ
పెద్దకొత్తపల్లి, జూన్ 20 (ఆంధ్రజ్యోతి) : సమాజంలో వందేళ్లుగా ఓట్లు, సీట్లు, అధికారం తో సంబంధం లేకుండా నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజాసమస్యల పరి ష్కారానికై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తున్న ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీయేనని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.బాలనరసింహ వెల్లడిం చారు. శుక్రవారం పెద్దకొత్తపల్లి మండల పరి ధిలోని వెన్నచెర్ల గ్రామంలో సీపీఐ 18వ మం డల మహాసభ నిర్వహించారు. గ్రామంలో కార్య కర్తలు ప్రదర్శన అనంతరం పార్టీ పతాకావిష్క రణ చేశారు. బాలనరసింహ మాట్లాడుతూ పెద్దకొత్తపల్లి మండలంలో ప్రతీ గ్రామంలో సీపీఐ ఆనవాళ్లు ఉంటాయని, ఈ మండలంలో ఏ రాజకీయ పార్టీకి తీసిపోని స్థాయిలో సీపీఐ బలమైన శక్తిగా నేటికీ ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఎస్‌ఎండీ ఫయాజ్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు టి.నరసింహ, పెబ్బేటి విజేయుడు, మండల కార్యదర్శి బొల్లెద్దుల శ్రీనివాస్, నా యకులు బిజ్జ శ్రీనివాసులు, బండి లక్ష్మీపతి, శివ, మాజీ సర్పంచ్ బాలస్వామిశెట్టి, లక్ష్మీనారా యణ, కృష్ణయ్య, సాయిలు, మజీద్, కృష్ణ, మద్దిలేటి, రాధాకృష్ణ, బోయ సాయిలు, రామ చంద్రయ్య, ప్రజా నాట్యమండలి జిల్లా అధ్య క్షుడు తుపాకుల వెంకటేశ్, రాష్ట్ర నాయకులు వాసు, గోపాల్ పాల్గొన్నారు.