కార్మికుల పక్షాన రాజీలేని పోరాటాలు
ABN , Publish Date - Nov 02 , 2025 | 10:42 PM
మండల పరిధిలోని ఆలేరులో ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ వేడుక లు మండలంలో ఆలేరు గ్రామంలో ఘనంగా జరిగాయి.
- ఏఐటీ యూసీ ఆవిర్భావ వేడుకలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌ఎండీ ఫయాజ్
తెలకపల్లి, అక్టోబరు 2 (ఆంధ్రజ్యో తి) : మండల పరిధిలోని ఆలేరులో ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ వేడుక లు మండలంలో ఆలేరు గ్రామంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీసీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌ఎండీ ఫయాజ్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు శివశంకర్ హాజరయ్యారు. వారు మా ట్లాడుతూ కార్మికుల పక్షాన వీరోచిత పోరాటా లు సాగించిన చరిత్ర ఏఐటీయూసీకి మాత్రమే ఉందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలలో కార్మికుల హక్కులకై పోరాటం చేసిందని పేర్కొ న్నారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను ప్రస్తుతం కేంద్ర ప్రభు త్వం 4 కోడ్‌లుగా చేసి కార్మిక హక్కులను హరి స్తున్నదని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో సీసీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బాలమురళీకృష్ణ, తెలకపల్లి మండల కార్యదర్శి వేనేపల్లి రవీందర్, ఆలేరు గ్రామ మాజీ ఎంపీటీసీ జింకల ఈశ్వ రయ్య, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్య శంకర్‌గౌడ్, ఏఐటీయూసీ జిల్లా ఉపా ఽధ్యక్షులు అవుట వెంకటస్వామి, సీసీఐ పట్టణ కార్యదర్శి కపిలవాయి గోపీచారి, ఆలేరు మల్లికా ర్జున, అమాలి సంఘం సభ్యులు చెంది హుస్సేన్, దొండ రాములు, పెబ్బేటి వెంకటయ్య, దొండ కాసీం, బాలరాం, చిచ్చయ్య, బక్కయ్య, లింగం, సుల్తాను, బంగారయ్య తదితరులు పొల్గొన్నారు.