Share News

శిథిలావస్థలో యునానీ ఆస్పత్రి

ABN , Publish Date - Aug 25 , 2025 | 12:08 AM

మండలంలోని శివన్నగూడ గ్రామంలో ఏర్పాటు చేసిన యునానీ ఆస్పత్రి శిథిలావస్థకు చేరుకుంది.

 శిథిలావస్థలో యునానీ ఆస్పత్రి
శివన్నగూడలో శిథిలావస్థలో ఉన్న యునాని ప్రభుత్వ ఆస్పత్రి

శిథిలావస్థలో యునానీ ఆస్పత్రి

వైద్యానికి దూరమవుతున్న రోగులు

మర్రిగూడ, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని శివన్నగూడ గ్రామంలో ఏర్పాటు చేసిన యునానీ ఆస్పత్రి శిథిలావస్థకు చేరుకుంది. ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతమైనందున ఇక్కడి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఉద్దేశంతో ప్రభుత్వం 50 సంవత్సరాల క్రితం యునానీ ఆస్పత్రిని ప్రారంభించింది. ఈ ఆస్పత్రి భవనం జీర్ణావస్థకు చేరుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో రోగులు వైద్యసేవలు నోచుకోలేకపోతున్నారు. ఇక్కడ ప్రజలు ఎక్కువ ఫ్లోరైడ్‌ గురై కాళ్లు వంకర నడుము వంగి నడవలేని స్థితిలో ఉన్నారు. శివన్నగూడ గ్రామంలో నిర్మించిన ఈ ఆస్పత్రి పరిధిలో నామాపురం, కొట్టాల, మేటిచంద్రపురం, ఇందుర్తి, సారంపేట, గర్షగడ్డ, పాకగూడ, లంకలపల్లి, చర్లగూడెం, రాంరెడ్డిపల్లి, వెంకపల్లి, వెంకపల్లితండా, నర్సిరెడ్డిగూడెం, ఖుదాభక్ష్‌పల్లి, అంతంపేట, సోమరాజుగూడ, రాజ్య తండా, రంగం తండా భూజ్యతండా, పలు గ్రామాలు ఉన్నాయి. పరిధిలో సుమారు 20వేల జనాభా గల ఈ ప్రాంతంలో ఎక్కువగా ఫ్లోరైడ్‌ బాధితులే ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలకు యునాని ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలని ఈ ప్రాంతం లో ఆస్పత్రులను ఏర్పాటు చేశారు. ఈ భవనం మరమ్మతులకు నోచుకోలేక శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రజలకు వైద్యం అందని ద్రాక్షగా మారింది. ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరడంతో పాటు వైద్యులు కూడా సరైన సమయానికి రావడం లేదు. దీంతో వైద్యసేవలు పొందేందుకు వచ్చిన వారు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇప్పటికైనా జిల్లా వైద్యశాఖ అధికారులు స్పందించి శిథిలావస్థకు చేరుకున్న యునానీ ప్రభుత్వ ఆస్పత్రిని తొలగించి నూతన భవనాన్ని నిర్మించి మెరుగైన వైద్య సేవలు అందేవిధంగా చూడాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలి

ఇరగదిండ్ల సత్తయ్య, శివన్నగూడెం

ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతమైనందున వైద్యం కోసం నిత్యం ఎంతో మంది రోగులు వస్తారు. యునానీ ఆస్పత్రి శిథిలావస్థకు చేరుకోవడంతో సరైన వసతులు లేక ఎప్పుడు కూలిపోతుందని ప్రాణాలు అరచేతులో పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఆస్పత్రిలో ఉన్నంతసేపు భయపడుతూ ఎప్పుడు వెళ్లాలనే ఆలోచనతో కొంతమంది వైద్యం చేసుకోకుండానే వెళ్లిపోతున్నారు. అధికారులు స్పందించి నూతన భవనాన్ని నిర్మించి రోగులకు వైద్య సేవలు అందే విధంగా చూడాలి.

Updated Date - Aug 25 , 2025 | 12:09 AM