Share News

kumaram bheem asifabad- వయోజన విద్యకు ‘ఉల్లాస్‌’

ABN , Publish Date - Oct 01 , 2025 | 10:37 PM

గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులైన మహిళల్లో అక్షర వెలుగులు నింపడంతో పాటు చదువు మధ్యలో ఆపేసిన వారికి విద్య అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్యాచరణ చేపడుతున్నాయి. విద్యాశాఖ, సెర్ప్‌ ఆధ్వర్యంలో ఉల్లాస్‌ (అండర్‌ స్టాండింగ్‌ ఆఫ్‌ లైఫ్‌లాంగ్‌ లెర్నింగ్‌ ఫర్‌ ఆల్‌ సొసైటీ) పేరుతో స్వ యం సహాయక సంఘాల సభ్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే ప్రక్రియ ప్రారంభించారు.

kumaram bheem asifabad- వయోజన విద్యకు ‘ఉల్లాస్‌’
లోగో

- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యాశాఖ, సెర్ప్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం

కాగజ్‌నగర్‌ టౌన్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులైన మహిళల్లో అక్షర వెలుగులు నింపడంతో పాటు చదువు మధ్యలో ఆపేసిన వారికి విద్య అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్యాచరణ చేపడుతున్నాయి. విద్యాశాఖ, సెర్ప్‌ ఆధ్వర్యంలో ఉల్లాస్‌ (అండర్‌ స్టాండింగ్‌ ఆఫ్‌ లైఫ్‌లాంగ్‌ లెర్నింగ్‌ ఫర్‌ ఆల్‌ సొసైటీ) పేరుతో స్వ యం సహాయక సంఘాల సభ్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే ప్రక్రియ ప్రారంభించారు. ఈ మేరకు జిల్లాలోని స్వశక్తి సంఘాల్లో చదువు రాని, మధ్యలో ఆపేసిన సభ్యులను గుర్తించి వివరాలు నమోదు చేశారు. వీరికి చదు వు నేర్పి ఆర్థిక, డిజిటల్‌, అక్షరాస్య త, వాణిజ్య నైపుణ్యాలు, ఆరోగ్య సంరక్షణపై అవగా హన కలిస్తారు.

- 96,580 మంది గుర్తింపు..

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 96,580 మందిని గుర్తించారు. వీరిలో స్వయం సహాయక సంఘాల సభ్యులు అధికంగా ఉన్నారు. ఉల్లాస్‌ కార్యక్రమంలో భాగంగా వీరిలో అక్షరాస్యత పెంపొం దించడానికి నడుం బిగించారు. ఇందులో భాగంగా క్షేత్ర స్థాయిలో నిరక్షరాస్యులైన అతివలను గుర్తించారు. గ్రామాల్లో సర్వే నిర్వహించి జిల్లా వ్యాప్తంగా 96,580 మందిని గుర్తించి వీరిలో తొలివిడతలో 22500 మంది లక్ష్యంగా పని ప్రారంభించారు. వీరికి అక్షరాలు నేర్పడా నికి 2250 మంది వాలంటీర్లను ఆయా సంఘాల్లో ఉన్న ఔత్సాహిక మహిళలను ఎంపిక చేస్తారు. జిల్లా వ్యాప్తంగా వాలంటీర్లను గుర్తించి 22,123 మందిని యాప్‌లో వివరాలు పొందు పరిచి, మండలాల వారీ గా ఉపాధ్యా యులను, వీవోఎలకు శిక్షణ ఇస్తారు. చదువు చెప్పేందుకు అవసరమైన పుస్తకాలు ఆయా మండలాలకు చేరుకున్నాయి. గ్రామ స్థాయిలో వలం టీర్లకు శిక్షణనిచ్చి చుదువు నేర్చుకున్న తర్వాత ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి పదో తరగతతి పూర్తి చేసేలా అవకాశం కల్పిస్తారు.

- మధ్యలో ఆపేసిన వారికి..

ఆర్థిక వెసులుబాటు, కుటుంబ పరిస్థితులతో మధ్యలో చదువు మానేసిన మహిళలపైనా దృష్టి సారించారు. తెలంగాణ సార్వత్రిక విద్యా పీఠ్‌(టాస్‌) ద్వారా వీరికి అవసరమైన విద్య అందించడానికి చర్యలు తీసుకుంటున్నారు. వారిని ఓపెన్‌ స్కూల్‌లో చేర్పించి చదువుకునేలా ప్రోత్సహిస్తున్నారు. జిల్లాలో ఓపెన్‌ స్కూల్‌లో పదో తరగతిలోపు, ఇంటర్‌ వరకు చదువుకొని ఆపేసిన వారిని గుర్తించినట్లు జిల్లా అధికారి కటుకం మధూకర్‌ తెలిపారు. వీరికి పై చదువులు చదివేలా అవగాహణ కల్పిస్తారు. ఉన్నత విద్యతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ప్రోత్సహిస్తూ ఇప్పటి వరకు స్వయం సహాయ సంఘా ల సమన్వయంతో పూర్తి స్తాయిలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసి వారి భవిష్యత్తులో ఉపాఽధి అవకాశాలు పెంపొందించడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు.

ఉల్లాస్‌ పథకంతో అక్షరాస్యత..

- ్టకటుకం మధూకర్‌, జిల్లా మోబిలైజేషన్‌ అఽధికారి

ఉల్లాస్‌ పథకంతో అక్షరాస్యత పెంపొందుతుంది. జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ, సెర్ప్‌ శాఖ సమన్వ యంతో నిరక్షరాస్యులను గుర్తించాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉల్లాస్‌ పథకం ద్వారా లక్ష్యం కంటే ఎక్కువ మందికి ఇప్పటికే గుర్తించాం. నిరక్ష రాస్యులైన మహిళలు భవిష్యత్తులో చక్కని ఫలితాలు దీనితో సాధించగలుగుతారు. ఉల్లాస్‌ పథకంలో 912 మంది ఓపెన్‌ స్కూల్‌ విధానంలో చదువు మానేశారు.

Updated Date - Oct 01 , 2025 | 10:37 PM