Road Accident: నిమజ్జనానికి వెళ్లివస్తుండగా రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
ABN , Publish Date - Sep 06 , 2025 | 03:46 AM
వినాయక నిమజ్జన వేడుకల్లో పాల్గొని ఇంటికి తిరిగివస్తున్న ఇద్దరు యువకులను డీసీఎం వాహనం రూపంలో..
పెబ్బేరు, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): వినాయక నిమజ్జన వేడుకల్లో పాల్గొని ఇంటికి తిరిగివస్తున్న ఇద్దరు యువకులను డీసీఎం వాహనం రూపంలో వచ్చిన మృత్యువు బలిగొంది. ఈ సంఘటన వనపర్తి జిల్లా పెబ్బేరులో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వనపర్తి జిల్లా నాచహళి గ్రామానికి చెందిన 11 మంది యువకులు జోగుళాంబ గద్వాల జిల్లా బీచుపల్లి పుణ్య క్షేత్రం దగ్గర కృష్ణానదిలో వినాయకుడిని నిమజ్జనం చేశారు. అనంతరం ట్రాక్టర్‌లో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో పెబ్బేరు మండలం రంగాపూర్ గ్రామ సమీపంలో హైదరాబాద్‌కు వెళ్తున్న డీసీఎం వాహనం వెనక వైపు నుంచి ట్రాక్టర్‌ను అతివేగంతో ఢీ కొట్టింది. దీంతో ట్రాక్టరులో ఉన్న డ్రైవర్‌తో పాటు నలుగురు కిందపడగా.. ట్రాక్టర్ జాతీయ రహదారిపై దాదాపు అర కిలోమీటరు వరకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంజన్ పక్కన కూర్చున్న మండ్ల శంకర్(21), గుప్త సాయితేజ(23) అక్కడికక్కడే మృతి చెందగా, ఎనిమిది మందికి గాయాలయ్యాయి.