New Battery Energy Storage System: రాష్ట్రంలో మరో 2 బీఈఎస్‌ఎస్‌లు!
ABN , Publish Date - Oct 17 , 2025 | 02:43 AM
రాష్ట్రంలో రెండు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌లు(బీఈఎ్‌సఎ్‌సలు) ఏర్పాటు చేయాలని జెన్‌కో నిర్ణయించింది. ఒక్కోటి గంటకు 750 మెగావాట్ల చొప్పున సామర్థ్యంతో...
మహేశ్వరం, చౌటుప్పల్‌లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌లకు జెన్‌కో నిర్ణయం
హైదరాబాద్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రెండు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌లు(బీఈఎ్‌సఎ్‌సలు) ఏర్పాటు చేయాలని జెన్‌కో నిర్ణయించింది. ఒక్కోటి గంటకు 750 మెగావాట్ల చొప్పున సామర్థ్యంతో మహేశ్వరం, చౌటుప్పల్‌లోని 440/220 కేవీ సబ్‌స్టేషన్ల వద్ద ఏర్పాటు చేయాలని జెన్‌కో ప్రతిపాదన. ఈ అంశంపై ఈ నెల 23న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. క్యాబినెట్ అనుమతి లభిస్తే జెన్‌కో టెండర్లు పిలవనుంది. వీటికి రూ.3,300 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. బీఈఎ్‌సఎ్‌సలకు 40 శాతం వయబిలిటీ గ్యాప్ ఫండ్ (వీజీఎ్‌ఫ)ను కేంద్రం సమకూర్చనుంది. కాగా, ఇప్పటికే హైదరాబాద్ శివారులోని శంకర్‌పల్లిలో 250 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటుకు టెండర్ ప్రక్రియ పూర్తయింది. మూడుచోట్లా పూర్తయితే బీఈఎ్‌సఎ్‌సల విషయంలో దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం సాయంత్రం 5:30 నుంచి రాత్రి 10 గంటల దాకా యూనిట్ కరెంట్ రూ.10 దాకా ఓపెన్ యాక్సె్‌సలో అమ్ముడుపోతుంది. భారీ డిమాండ్ ఉండటంతో ఆ సమయంలో కరెంట్ ఇవ్వడానికి డిస్కమ్‌లు ఓపెన్ యాక్సె్‌సపై ఆధారపడుతున్నాయి. ఉదయం 8 నురచి సాయంత్రం 5 గంటల దాకా సోలార్ విద్యుత్ ఉత్పాదనకు అనుకూలంగా ఉంటుంది. ఆ సమయంలో సౌర విద్యుత్‌ను కొనడం లేదా సొంతంగా ఉత్పత్తి చేసుకుని బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌లో నిల్వ చేసుకుంటే.. డిమాండ్ రాగానే అమ్ముకోవడానికి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.