బ్యాటరీలు దొంగతనం చేస్తున్న ఇద్దరు అరెస్టు
ABN , Publish Date - Aug 04 , 2025 | 12:41 AM
: ద్విచక్ర వాహనాలతో పాటు ట్రాక్టర్, ఆటోల బ్యాటరీలు దొంగతనం చేస్తున్న ఇద్దరిని నల్లగొండ జిల్లా కనగల్ పోలీసులు అరెస్టు చేశారు.
నల్లగొండ క్రైం, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): ద్విచక్ర వాహనాలతో పాటు ట్రాక్టర్, ఆటోల బ్యాటరీలు దొంగతనం చేస్తున్న ఇద్దరిని నల్లగొండ జిల్లా కనగల్ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చండూరు సీఐ కె. ఆదిరెడ్డి కేసు వివరాలు వెల్లడి ంచారు. నల్లగొండ పట్టణానికి చెందిన సముద్రాల కృష్ణ, షేక్ టిప్పుసుల్తాన్ వాహనాల బ్యాటరీలు, బైక్‌లు దొంగతనం చేస్తుండేవారు. గత నెల 27వ తేదీన కనగల్ మండలంలోనీ కేబీ తండా గ్రామానికి చెందిన కరుణాకర్‌రెడ్డి రోడ్డు పక్కన వ్యవసాయ క్షేత్రం వద్ద ద్విచక్ర వాహనం పార్క్ చేశాడు. వ్యవసాయ పనులు ముగించుకొని వచ్చే సరికి అక్కడ ద్విచక్రవాహనం కనిపించకపోవడంతో బాధితుడు పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆదివారం ఉదయం 8గంటలకు కనగల్ పోలీసులు నల్లగొండ-దేవరకొండ రహదారిపై కనగల్ ఎక్స్‌రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితులు నల్లగొండ వైపు నుంచి దేవరకొండ వైపు వెళ్తున్న ఆటోతో పాటు మోటార్ సైకిల్‌పై వెళ్తూ పోలీసులకు అనుమానాస్పందగా కన్పిం చారు. పోలీసులను చూసిన తిరిగి వెనక్కి వెళ్తుండగా పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. వారి వద్ద 20బ్యాటరీలు దొరికాయి. రెండు వాహనాలతో పాటు వాహనాలు నడుపుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించారు. పలుచోట్ల పార్కింగ్ చేసిన వాహనాల్లో బ్యాటరీలల్లో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఈ కేసును చేధించిన ఎస్‌ఐ కె.రాజీవ్‌రెడ్డి, కానిస్టేబుల్ ఎం. రవీందర్‌రెడ్డి, వెంకన్న, శేఖర్, సురేష్, రమేష్, వెంకట్‌రెడ్డిలను ఎస్పీ అభినందించారు.