Share News

POCSO cases: ఆన్‌లైన్‌లో బాలల అశ్లీల దృశ్యాలు

ABN , Publish Date - Oct 11 , 2025 | 03:08 AM

చిన్నపిల్లల అశ్లీల దృశ్యాలను ఆన్‌లైన్‌లో షేర్‌ చేసిన ఇద్దరు వ్యక్తులపై చాదర్‌ఘాట్‌, డబీర్‌పుర పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు..

POCSO cases: ఆన్‌లైన్‌లో బాలల అశ్లీల దృశ్యాలు

  • ఇద్దరు నిందితులపై పోక్సో కేసు

చాదర్‌ఘాట్‌, అమీర్‌పేట అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): చిన్నపిల్లల అశ్లీల దృశ్యాలను ఆన్‌లైన్‌లో షేర్‌ చేసిన ఇద్దరు వ్యక్తులపై చాదర్‌ఘాట్‌, డబీర్‌పుర పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. చంచల్‌గూడకు చెందిన మహ్మద్‌ హుస్సేన్‌ (34), ఆజాంపురకు చెందిన సయ్యద్‌ జమీల్‌ (32)లు చిన్నపిల్లల అశ్లీల దృశ్యాలను ఆన్‌లైన్‌లో, సోషల్‌ మీడియాలో షేర్‌ చేసినట్లు సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌ ద్వారా పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. నగరంలోని పిల్లలపై జరిగే నేరాలను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నామని, చిన్నపిల్లలకు సంబంధించిన అశ్లీల దృశ్యాలను, అసభ్యకర పోస్టులను ఆన్‌లైన్‌లో, సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం, చూడడం చట్టరీత్యా నేరమని మలక్‌పేట ఏసీపీ సుబ్బిరామిరెడ్డి తెలిపారు. ఇలాంటి నేరాలకు సంబంధించిన సమాచారంపై చైల్డ్‌ సెక్సువల్‌ అబ్యూస్‌ మెటీరియల్‌ (సీఎ్‌సఏఎం), ఎన్‌సీఆర్‌బీ, తదితర సంస్థలు నిఘా పెట్టి, స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తాయని, అటువంటి వ్యక్తులను గుర్తించి వెంటనే అరెస్ట్‌ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇద్దరు నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, వారిపై షీట్స్‌ తెరవనున్నట్లు వెల్లడించారు. బాలల లైంగిక దాడి వీడియోలను ఇతరులకు షేర్‌ చేసిన మరో నిందితుడిపై ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Oct 11 , 2025 | 03:08 AM