TET Exemption Review: సీపీఎస్ వద్దంటూ ట్విటర్ వార్
ABN , Publish Date - Oct 01 , 2025 | 03:28 AM
అక్టోబరు 1 నుంచి సీపీఎస్ వద్దు, ఓపీఎస్ ముద్దు హ్యాష్ ట్యాగ్‌తో ట్విటర్(ఎక్స్) వేదికగా వార్ మొదలు పెడతామని నేషనల్ మూమెంట్ ఫర్...
హైదరాబాద్/న్యూఢిల్లీ, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): అక్టోబరు 1 నుంచి సీపీఎస్ వద్దు, ఓపీఎస్ ముద్దు హ్యాష్ ట్యాగ్‌తో ట్విటర్(ఎక్స్) వేదికగా వార్ మొదలు పెడతామని నేషనల్ మూమెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియర్(ఎన్‌ఎంవోపీఎ్‌స) జనరల్ సెక్రటరీ స్థితప్రజ్ఞ తెలిపారు. ప్రధానమంత్రి నుంచి కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులకు సందేశాలు పంపుతామని మంగళవారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేస్తున్న సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వారి ఎక్స్ ఖాతాల నుంచి మెసేజ్‌లు పంపుతారని వెల్లడించారు. ఉపాధ్యాయులు రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణత కాకుంటే వారిని ఉద్యోగం నుంచి తొలగించాలనే అంశంపైనా ఆర్‌టీఈ చట్టసవరణ కోరుతూ ఎక్స్ వేదికగా వినతులు పంపుతామన్నారు.
టెట్ తప్పనిసరిపై సుప్రీంలో ఎస్‌టీఎ్‌ఫఐ రివ్యూ పిటిషన్
ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరని, లేదంటే వారు ఉద్యోగాన్ని వదులుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎ్‌సటీఎ్‌ఫఐ) రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. మంగళవారం ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి చావా రవి పేరుతో న్యాయవాది సుభాష్ చంద్రన్ పిటిషన్ దాఖలు చేశారు.