Share News

Tungabhadra: వాటా మేరకు వ్యయం భరిస్తారా

ABN , Publish Date - Sep 24 , 2025 | 03:53 AM

తుంగభద్ర జలాల్లో ఏ మేరకు వాటా కలిగి ఉన్నారో.. ఆ మేరకు ప్రాజెక్టు వ్యయానికి సంబంధించిన వాటా భరించడానికి సిద్ధంగా ఉన్నారా...

Tungabhadra: వాటా మేరకు వ్యయం భరిస్తారా

  • తెలంగాణ ప్రభుత్వానికి తుంగభద్ర బోర్డు లేఖ

హైదరాబాద్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర జలాల్లో ఏ మేరకు వాటా కలిగి ఉన్నారో.. ఆ మేరకు ప్రాజెక్టు వ్యయానికి సంబంధించిన వాటా భరించడానికి సిద్ధంగా ఉన్నారా? అని తుంగభద్ర బోర్డు తెలంగాణను కోరింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి ఓఆర్‌కే రెడ్డి తెలంగాణ ఈఎన్‌సీ(జనరల్‌)కు మంగళవారం లేఖ రాశారు. గతేడాది నవంబరు 22న తుంగభద్ర బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చర్చించిన నిర్ణయం మేరకు తుంగభద్ర జలాల్లో తెలంగాణ వాటా 8.92 శాతంగా ఉన్నందున.. ఆమేరకు ప్రాజెక్టు వ్యయాన్ని చెల్లించడానికి తెలంగాణ అంగీకరిస్తుందా? అని బోర్డు గుర్తు చేసింది. గత మూడేళ్ల వ్యయం ఆధారంగా చెల్లింపులకు సమ్మతి తెలుపుతారా అంటూ ఈ లేఖ రాసింది.

Updated Date - Sep 24 , 2025 | 03:53 AM