Share News

క్షయ వ్యాధిగ్రస్తులు త్వరగా కోలుకోవాలి

ABN , Publish Date - Mar 16 , 2025 | 11:12 PM

పోషకాహా రంతో క్షయ వ్యాధిగ్రస్తులు త్వరగా కోలుకోవాలని నాగ ర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచ కుళ్ల రాజేష్‌రెడ్డి అన్నారు.

క్షయ వ్యాధిగ్రస్తులు త్వరగా కోలుకోవాలి
క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి

-పౌష్టికాహారం పంపిణీలో ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి

తాడూరు, మార్చి 16 (ఆంధ్రజ్యోతి) : పోషకాహా రంతో క్షయ వ్యాధిగ్రస్తులు త్వరగా కోలుకోవాలని నాగ ర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచ కుళ్ల రాజేష్‌రెడ్డి అన్నారు. తాడూరు మండల కేంద్ర ఆవరణలో క్షయ వ్యాధిగ్ర స్తులకు ఉచితంగా పోషకా హార కిట్లను పంపిణీ చేసే కార్యక్రమానికి ఆదివారం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లా డారు. ప్రతీ రోజు చికిత్సతో పాటుగా ఈ అదనపు పోషకాహారం కిట్లను వినియోగిం చుకుని క్షయ వ్యాధి నుంచి త్వరగా కోలుకో వాలని సూచించారు. అనంతరం డీఎంహెచ్‌వో కేవీ.స్వరాజ్యలక్ష్మి మాట్లాడుతూ డిసెంబరు 7వ తేదీ నుంచి నిర్వహించిన వంద రోజుల నిక్షయ్‌ శివిర్‌ కార్యక్రమంలో ఇప్పటి వరకు జిల్లాలో 238 క్యాంపులను ఏర్పాటు చేసి 1,32,588 మం దికి టీబీ వ్యాధి కోసం పరీక్షలు చేసినట్లు తెలి పారు. ప్రతీ నెల ఒక పోషకాహార కిట్టును అం దజేయనున్నామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీడీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటదాస్‌, నా ట్కో ఫార్మా కంపెనీ ప్రతినిధి మదన్మోహన్‌, ప్రోగ్రామ్‌ అధికారి డాక్టర్‌ రాజశేఖర్‌, వైద్యాధి కారి సంతోష్‌అభిరామ్‌, డీపీవో రేణయ్య, పర్యవేక్షణ సిబ్బంది, ఏఎన్‌ఎమ్‌లు, ఆశాలు, వ్యాధి గ్రస్తులు పాల్గొన్నారు.

మామిళ్లపల్లిలో బండలాగుడు పోటీలు

ఉప్పునుంతల : మండల పరిధిలోని మామి ళ్లపల్లి గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మో త్సవాల భాగంగా ఆదివారం ఆలయం ఆధ్వర్యం లో అంతర్రాష్ట్ర ఎద్దుల బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను నాగర్‌ కర్నూల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కూచకుళ్ల రాజేష్‌రెడ్డి ప్రారం భించారు. అంతకు ముందు ఎమ్మెల్యేను అర్చ కులు స్వాగతం పలికి ఆలయంలో ప్ర త్యేక పూ జలు చేయించారు. ఎమ్మెల్యేకు ఆలయ చైర్మన్‌ నరసింహారావు శాలువా కప్పి సన్మానించారు. విజేతలుగా నిలిచిన ఎద్దుల యజమానులకు నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్ర మంలో ఆలయ చైర్మన్‌ నరసింహారావు, మాజీ జడ్పీటీసీ అనంతప్రతాప్‌రెడ్డి, మాజీ ఎంపీపీ అరుణానరసింహారెడ్డి, మాజీ సర్పంచ్‌ ఇంద్రాసే నారెడ్డి, కాగ్రెస్‌ పార్టీ మండల అఽధ్యక్షుడు కట్టా అనంతరెడ్డి, నాయకులు రఘపతిరెడ్డి, గంగుల నరసింహారెడ్డి, మోహన్‌గౌడ్‌, ఆలయ పాలక మండల సభ్యులు గణేష్‌గౌడ్‌, ఆలయ ఈవో నరసింహులు ఉన్నారు.

Updated Date - Mar 16 , 2025 | 11:12 PM