కొండగట్టుకు టీటీడీ నిధులు హర్షణీయం: సంజయ్
ABN , Publish Date - Dec 21 , 2025 | 05:57 AM
ఆంజనేయస్వామి భక్తుల సౌకర్యార్థం కొండగట్టులో 96 గదుల సత్రం నిర్మాణానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సిఫారసుతో...
హైదరాబాద్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఆంజనేయస్వామి భక్తుల సౌకర్యార్థం కొండగట్టులో 96 గదుల సత్రం నిర్మాణానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సిఫారసుతో టీటీడీ రూ.35.19 కోట్లను కేటాయించడం హర్షణీయమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఒక ప్రకటనలో తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొండగట్టు ఆలయానికి రూ.100కోట్లు ఇస్తామని, నయాపైసా కూడా ఇవ్వకుండా మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పాలకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కొండగట్టు ఆలయానికి నిధులు కేటాయించి, అన్ని విధాలా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.