VC Sajjanar: అయోధ్య, వారాణసీలకు ఆర్టీసీ ప్యాకేజీలు!
ABN , Publish Date - Sep 14 , 2025 | 05:47 AM
ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన అయోధ్య, వారాణసీ తదితర ప్రాంతాలకు టూర్ ప్యాకేజీలను వెంటనే అందుబాటులోకి తేవాలని టీఎ్‌సఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్...
అధికారులకు సంస్థ ఎండీ సజ్జనార్ ఆదేశాలు
హైదరాబాద్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన అయోధ్య, వారాణసీ తదితర ప్రాంతాలకు టూర్ ప్యాకేజీలను వెంటనే అందుబాటులోకి తేవాలని టీఎ్‌సఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ ఇటీవల ప్రవేశపెట్టిన టూర్ ప్యాకేజీలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నందున కొత్త ప్యాకేజీలను త్వరలోనే అందుబాటులోకి తేవాలని కోరారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో శనివారం రాష్ట్రస్థాయి విలేజ్, కాలనీ బస్ ఆఫీసర్ల సమావేశం జరిగింది. ముఖ్య అతిధిగా సజ్జనార్ మాట్లాడుతూ.. ఆర్టీసీ సేవలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. ‘యాత్రదానం’లో భాగంగా అనాథలు, నిరాశ్రయులైన వృద్ధులు, దివ్యాంగులు, విద్యార్థులను విహారయాత్రలకు తీసుకెళ్లేందుకు డిపోల వారీగా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.