మమ్మల్ని నమ్మండి.. మంచి విద్యను బోధిస్తాం..!
ABN , Publish Date - May 27 , 2025 | 12:36 AM
ప్లీజ్ మమ్మల్ని నమ్మండి...మీ పిల్లలకు మంచి విద్యను బోధిస్తాం... వారిని క్రమశిక్షణ గల విద్యార్థులుగా తీర్చిదిద్దుతామని నా ర్కట్‌పల్లి జిల్లా పరిషత ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు హామీ ఇస్తున్నారు.
మమ్మల్ని నమ్మండి.. మంచి విద్యను బోధిస్తాం..!
విద్యార్థుల తల్లిదండ్రులతో టీచర్లు
ప్రైవేట్ పాఠశాలలకు పంపొద్దని హితవు
నార్కట్‌పల్లి, మే 26(ఆంధ్రజ్యోతి): ప్లీజ్ మమ్మల్ని నమ్మండి...మీ పిల్లలకు మంచి విద్యను బోధిస్తాం... వారిని క్రమశిక్షణ గల విద్యార్థులుగా తీర్చిదిద్దుతామని నా ర్కట్‌పల్లి జిల్లా పరిషత ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు హామీ ఇస్తున్నారు. హెచఎం రాము లు మార్గదర్శకత్వంలో టీచర్లు మూడు బృందాలుగా ఏర్పడి పాఠశాలలో అడ్మిషన్ల కోసం విద్యార్థుల ఇంటి బాట పట్టారు. ప్రధానంగా ప్రైవేట్ పాఠశాలలకు పిల్లలను పంపిస్తున్న తల్లిదండ్రులను కలిసి ప్రభు త్వ పాఠశాలలో చదివిపించడం ద్వారా సమకూరుతున్న ప్రయోజనాలు, అందుబాటులో ఉన్న వనరుల గురించి వివరిస్తూ కరపత్రం పంపిణీ చేశారు. ఒకవేళ మార్పు తీసుకు రాలేకపోతే వచ్చే ఏడాది మా స్కూల్‌లో వారిని చదివించమని మేం మిమ్మల్ని ఒత్తిడి చేయమని నచ్చచెబుతూ హామీ ఇస్తున్నారు.
బడిఈడు పిల్లలను బడిలో చేర్పించాలి
చిట్యాలరూరల్: బడిఈడు పిల్లలను పా ఠశాలలో చేర్పించాలని నేరడ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయు డు వల్లపు నాగరాజు అన్నారు. చిట్యాల మం డలం నేరడలో సోమవారం నిర్వహించిన బ డిబాట కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మూడేళ్ల వరకు చిన్నారులను అంగనవాడీ కేంద్రాలకు, ఐదేళ్లు వచ్చి న పిల్లలను తప్పనిసరిగా పాఠశాలకు పంపించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, మధ్యాహ్న భోజనం అందించనున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలను ఇంటివద్ద ఉంచవద్దని పాఠశాలకు పంపించాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయుడు లింగస్వామి, ముశం శ్రీను, బత్తుల చందు, కడారి గోపాల్, సుజాత, అలివేలు తదితరులు పాల్గొన్నారు.