Share News

kumaram bheem asifabad- దేవి శోభాయాత్రలో రభస

ABN , Publish Date - Oct 04 , 2025 | 10:55 PM

జిల్లా కేంద్రంలో దేవి నవరాత్రులు పూర్తి చేసుకుని శుక్రవారం రాత్రి నిర్వహించిన శోభాయాత్రలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాకేంద్రంలో తొమ్మిది రోజుల పాటు కొనసాగిన నవరాత్రులు ముగ్గింపు ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమ శోభాయాత్ర ప్రారంభమైంది. కాగా డీజేలకు అనుమతి లేదని పోలీసులు శోభాయాత్ర నిర్వహిస్తున్న వారి వద్దకు వెళ్లి వాహనాలను అడ్డుకున్నారు. దీంతో పలువురు శోభాయాత్ర నిర్వాహకులు పోలీసులను అనుమతి ఇవ్వాలని పండగ సమయంలో మాత్రమే శోభాయాత్ర నిర్వహిస్తామని కోరారు.

kumaram bheem asifabad- దేవి శోభాయాత్రలో రభస
రోడ్డుపై బైఠాయించిన భక్తులు, నిర్వాహకులు

- ఏఎస్పీ చొరవతో ముగిసిన వివాదం

ఆసిఫాబాద్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో దేవి నవరాత్రులు పూర్తి చేసుకుని శుక్రవారం రాత్రి నిర్వహించిన శోభాయాత్రలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాకేంద్రంలో తొమ్మిది రోజుల పాటు కొనసాగిన నవరాత్రులు ముగ్గింపు ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమ శోభాయాత్ర ప్రారంభమైంది. కాగా డీజేలకు అనుమతి లేదని పోలీసులు శోభాయాత్ర నిర్వహిస్తున్న వారి వద్దకు వెళ్లి వాహనాలను అడ్డుకున్నారు. దీంతో పలువురు శోభాయాత్ర నిర్వాహకులు పోలీసులను అనుమతి ఇవ్వాలని పండగ సమయంలో మాత్రమే శోభాయాత్ర నిర్వహిస్తామని కోరారు. పోలీసులు జిల్లాలో 30 పోలీసు యాక్ట్‌ అమలులో ఉందని, దీంతో పాటు ఎన్నికల కోడ్‌ కూడా ఉందని చెబుతూ భక్తులు విన్నపాలు అంగీకరించ లేదు. ఓ ఎస్సై స్థాయి అధికారి బ్రాహ్మణవాడ శోభాయాత్ర నిర్వహకులను దూషించారని ఆరోపిస్తూ నిర్వాహకులు పొట్టి శ్రీరాములు చౌక్‌ వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సీఐ బాలాజీ వర్రసాద్‌ అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నం చేసినప్పటికీ భక్తులు వెనక్కి తగ్గలేదు. దీంతో శోభాయాత్ర మూడు గంటల పాటు నిలిచి పోయింది. వషయం తెలుసుకున్న ఏఎస్పీ చిత్తరంజన్‌ అక్కడికి చేరుకోవడంతో పాటు భక్తులను, ప్రజలకు నచ్చచెప్పి అక్కడ జామ్‌ అయిన శోభాయాత్ర వాహనాలను ముందుకు కదిలించే ప్రయత్నం చేశారు.

Updated Date - Oct 04 , 2025 | 10:55 PM