Share News

అతలాకుతలం....

ABN , Publish Date - Aug 16 , 2025 | 11:37 PM

జిల్లాలో శనివారం భారీ వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి నుంచే ప్రారంభమైన వర్షం తెల్లవారి ఉగ్రరూపం దాల్చింది. ఎడతెరపి లేకుండా కు రుస్తున్న భారీ వర్షం కారణంగా జనజీవనం అతలాకుతలం అయింది. గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తు న్నాయి.

అతలాకుతలం....

-జిల్లాలో భారీ వర్షం

-ఉప్పొంగిన వాగులు, నిలిచిన రవాణా సౌకర్యం

-గరిష్టంగా కోటపల్లిలో 15.8 సెం.మీ నమోదు

-జిల్లాలో సగటు వర్షపాతం 6.2 సెం.మీ.

-ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

-ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

మంచిర్యాల, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శనివారం భారీ వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి నుంచే ప్రారంభమైన వర్షం తెల్లవారి ఉగ్రరూపం దాల్చింది. ఎడతెరపి లేకుండా కు రుస్తున్న భారీ వర్షం కారణంగా జనజీవనం అతలాకుతలం అయింది. గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తు న్నాయి. చెరువులు, వాగుల్లో భారీగా వరద నీరు చేరుతోంది. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రవాణా సౌకర్యం నిలి చిపోయి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఎగువున కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లా కేంధ్రంలోని రాళ్లవాగు ప్ర మా దకర స్థితిలో ఉప్పొంగి ప్రవహిస్తోంది. అమరవీరుల స్థూపం వద్దగల కాజువే వంతెనపై నుంచి ఉధృతంగా వరద నీరు ప్ర వహిస్తుండటంతో రంగంపేట- లక్ష్మీనగర్‌ మధ్య రవాణా పూ ర్తిగా నిలిచిపోయింది.

జిల్లాలో వర్షపాతం నమోదు...

జిల్లాలో శనివారం 6.2 సెం.మీ సగటు వర్షపాతం నమో దుకాగా, కోటపల్లి మండలంలో గరిష్టంగా 15.8 సెం.మీ వర్షం కురిసింది. వేమనపల్లి మండలంలో 11 సెం.మీ, చెన్నూరు మండలంలో 8.8, లక్షెట్టిపేట మండలంలో 7.8, కాసిపేట మం డలంలో 7.7, జైపూర్‌ మండలంలో 6.9, నెన్నెల మండలంలో 6.8. మందమర్రి మండలంలో 5.8, జన్నారం మండలంలో 5.7, భీమారం మండలంలో 5.6 సెం.మీ, బెల్లంపల్లిలో 4.7, నస్పూర్‌లో 4.6. చొప్పున వర్షపాతం నమోదైంది.

ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీ వరద...

ఎగువున కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి పెద్ద మొత్తంలో వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 148.00 మీటర్లకు గాను ప్రస్తుతం 146.63 మీటర్లకు నీరు చేరింది. ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీ లు కాగా ప్రస్తుతం 16.463 టీంఎసీల నీరు నిలువ ఉంది. ఎ ల్లంపల్లి ప్రాజెక్టులోకి 90,118 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టు అవుట్‌ ఫ్లో 13,007 క్యూసెక్కులు ఉండగా, హైద్రా బాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ స్కీం కోసం 286 క్యూసెక్కులు, ఎన్టీపీసీ అవసరాలకు 121 క్యూసెక్కులు, జగిత్యాల జిల్లా నం దిమేడారంలోని నంది పంప్‌ హౌజ్‌కు 12,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

కడెం ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తివేత....

గోదావరి బేసిన్‌లోని నిర్మల్‌ జిల్లా కడెం రిజర్వాయర్‌కు ఉన్న 18 గేట్లలో 16 గేట్లు తెరిచి 1,41,489 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి పూర్తిస్థా యిలో నీరు చేరడంతో సాయంత్రం 5గంటల వరకు 10 గేట్లను ఎత్తి 26వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు

ఓపెన్‌ కాస్టుల్లో నిలిచిన ఉత్పత్తి...

ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షం కారణంగా జి ల్లాలోని శ్రీరాంపూర్‌, మందమర్రి, బెల్లంపల్లి సింగరేణి డివిజన్‌ లలోని ఓపెన్‌ కాస్టు గనుల్లో బొగ్గు తవ్వకాలు నిలిచిపో యాయి. ఓబీ మట్టి తొలగింపు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. క్వారీల్లో పెద్ద మొత్తంలో నీరు చేరడంతో పనులు జరగడం లేదు. దీంతో యంత్రాల సహాయంతో నీటిని తోడుతున్నారు. ముఖ్యంగా మొదటి, రెండవ షిఫ్టుల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది.

నస్పూర్‌లో పొంగిపోర్లిన డ్రైనేజీలు, ఒర్రెలు.. కాలనీల్లో వర్షపు నీరు....

నస్పూర్‌ : వాతావరణ ప్రభావం కారణంగా శనివారం ఉద యం నస్పూర్‌ పట్టణంలో భారీ వర్షం కురిసింది. రెండు గం టలకు పైగా కురిసిన వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లోకి ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. డ్రైనేజీలు, ఒర్రెలు వరద నీటితో నిండిపోయి ఉధృతంగా ప్రవహించాయి. సంఘమల్ల య్య పల్లె ప్రాంతం నుంచి ఊరు శ్రీరాంపూర్‌ మీదుగా న స్పూర్‌ చెరువులోకి వచ్చే ఓర్రె వరద నీటి ప్రవాహంతో ఉధృ తంగా ప్రవహించింది. కాలనీల్లోకి వరద నీరు చొచ్చుకువ చ్చింది. వరద నీరు చేరడంతో సీతారాంపల్లి రోడ్డులోని వెంకటే శ్వర కాలనీలోని పలువురు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సీ సీసీ కార్నర్‌ నుంచి సీతారాంపల్లికి వెళ్లే మార్గంలో ఒర్రె కాజ్‌వే పై నుంచి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. న స్పూర్‌ చెరువు పూర్తి స్థాయిలో నిండి పోయి ఎక్కువైనా నీరు మత్తడి ద్వారా దిగువకు వెళ్లుతుంది. దిగువన గోదావరి రో డ్డులో వరద నీరు పొలాల నుంచి ప్రవహిస్తూ రోడ్డు పై నుం చి వెళుతుంది. వినూత్న కాలనీ, శ్రీశ్రీ నగర్‌ల మధ్య గల తో ళ్లవాగు కాజ్‌వే పై నుంచి ప్రవహించడంతో స్థానికులు ఇబ్బం దులు ఎదుర్కొన్నారు. తాళ్లపల్లి పునరావాస కాలనీలో ఒర్రె వ రద నీటితో ఉదృతంగా ప్రవహించడంతో నీరు ముందుకు వె ళ్ల చుట్టు పక్కల ఉన్న ఇళ్లలోకి చేరింది. రోడ్డు మార్గంలోని కాజ్‌వే వంతెన పై నుంచి ప్రవహించడంతో చాలా సేపు రాక పోకలు నిలిచిపోయాయి. భారీ వర్షానికి జనాలు నానా ఇబ్బం దులు ఎదుర్కొవాల్సి వచ్చింది.

Updated Date - Aug 16 , 2025 | 11:37 PM