జయ శంకర్‌కు ఘన నివాళులు
ABN , Publish Date - Jun 21 , 2025 | 11:56 PM
నస్పూర్ పట్టణంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) జిల్లా కార్యాలయంలో శనివారం ప్రొఫెసర్ జయ శంకర్ వర్థంతి ని నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయ శంకర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు ఆర్పించారు.
నస్పూర్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి) : నస్పూర్ పట్టణంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) జిల్లా కార్యాలయంలో శనివారం ప్రొఫెసర్ జయ శంకర్ వర్థంతి ని నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయ శంకర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు ఆర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, పట్టణ అధ్యక్షుడు అక్కురి సుబ్బయ్య, నాయకులు గోగుల రవీందర్ రెడ్డి, వంగ తిరుపతి, గాదె సత్యం, బేర సత్యనారాయణ, రవి గౌడ్, అన్నపూర్ణ, కాటం రాజు, పెద్దపల్లి కోటిలింగం, సురేందర్ రెడ్డి, లతో పాటు బీఆర్‌ఎస్, టీబీజీకేఎస్ నాయకులు పాల్గొన్నారు.