Share News

కలెక్టరేట్‌ ఎదుట ఆదివాసీల ధర్నా

ABN , Publish Date - Jul 28 , 2025 | 11:32 PM

ఆదివాసీల సమస్యలను పరిష్క రించాలని డిమాండ్‌ చేస్తూ నస్పూర్‌లోని కలెక్టరేట్‌ ఎదుట ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) ఆధ్వర్యంలో సోమవారం ధర్నా జరిగింది. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అదనపు కలెక్టర్‌ చంద్రయ్యకు అందించారు. అంతకు ముందుగా ప్రధాన రహదారి ప్రధాన ద్వారం వద్ద నుంచి ర్యాలీగా తరలివచ్చారు.

కలెక్టరేట్‌ ఎదుట ఆదివాసీల ధర్నా
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న ఆదివాసీలు

నస్పూర్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి) : ఆదివాసీల సమస్యలను పరిష్క రించాలని డిమాండ్‌ చేస్తూ నస్పూర్‌లోని కలెక్టరేట్‌ ఎదుట ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) ఆధ్వర్యంలో సోమవారం ధర్నా జరిగింది. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అదనపు కలెక్టర్‌ చంద్రయ్యకు అందించారు. అంతకు ముందుగా ప్రధాన రహదారి ప్రధాన ద్వారం వద్ద నుంచి ర్యాలీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) జిల్లా అధ్యక్షుడు జేక శేఖర్‌ మాట్లాడుతూ టైగర్‌ జోన్‌ను పూర్తిగా ఎత్తి వేయాలని, 49 జీవోను పూర్తిగా రద్దు చేయాలన్నారు. పోడు వ్యవసాయానికి పట్టాలను ఇవ్వాల న్నారు. వైల్డ్‌లైఫ్‌ సంచార్‌ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. దసళి పట్టు గూళ్ళ రైతుల మీద అటవీ శాఖ అధికారుల దాడులు ఆపా లని, పంట వేసే వెసులు బాటు కల్పించాలన్నారు. ఆదివాసీలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెడంకి మాంతయ్య, దుగ్నె జయులు, గంట బాపులతో పాటు వివిధ మండ లాలకు చెందిన పలువురు ఆదివాసీలు పాల్గొన్నారు.

Updated Date - Jul 28 , 2025 | 11:32 PM