Share News

అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ గిరిజనుల ఆందోళన

ABN , Publish Date - Oct 05 , 2025 | 11:21 PM

అటవీ శాఖ అధికారులు తమపై అక్రమంగా కేసులు బనా యిస్తూ తమను వేధిస్తున్నారని గిరిజనులు ఆందోళన చేపట్టారు. ఆదివారం మండలంలోని తాళ్లపేట అటవీ రెంజ్‌ కార్యాలయం వద్ద మండలంలోని మామిడిపల్లి జీపీ పరిదిలోని దమ్మనపేట, మామిడి గూడ చెందిన గిరిజనులు బైఠాయించి ఆందోళన చేపట్టారు.

    అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ గిరిజనుల ఆందోళన
తాళ్లపేట అటవీ రెంజ్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న గిరిజనులు

దండేపల్లి అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): అటవీ శాఖ అధికారులు తమపై అక్రమంగా కేసులు బనా యిస్తూ తమను వేధిస్తున్నారని గిరిజనులు ఆందోళన చేపట్టారు. ఆదివారం మండలంలోని తాళ్లపేట అటవీ రెంజ్‌ కార్యాలయం వద్ద మండలంలోని మామిడిపల్లి జీపీ పరిదిలోని దమ్మనపేట, మామిడి గూడ చెందిన గిరిజనులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా నాయక్‌పోడ్‌ సంఘం నా యకులు తట్ర అర్జున్‌, సేదం బాపు మాట్లాడుతూ కొంత కాలంగా లింగాపూర్‌ అటవీ బీట్‌లో పోడు వ్యవసాయం చేసుకుంటున్నామన్నారు. ఈక్రమంలో అటవీ శాఖ అధికారులు గిరిజన మహిళలపై అక్ర మంగా కేసులు బనాయిస్తున్నారని వారు వాపోయారు. గిరిజన నాయకులతో చర్చిల పేరిట పిలిపించి చెట్లను నరికినట్లు తప్పుడు కేసులు పెట్టి నోటిసులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై పె ట్టిన కేసులు వెనక్కి తీసుకోకపోతే ఆందోళన ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. పోడు వ్యవసాయం భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వానికి అధికారులకు సహకరిస్తున్నా తమపై ఇలా ఫారెస్టు అ ధికారులు ప్రవర్తించడం సరికాదన్నారు. ఉన్నతాధికారులు గతంలో ఉన్న కేసులు ఎత్తివేస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ స్థానిక అటవీ శాఖ అధికారులు ఒక్కొక్కరిపై 5కేసులు బనాయించడం ఎంత వర కు సమాంజమన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు శంకర్‌, విఘ్ణ, దుబ్బరాజం, బాలు, మహేష్‌, రాజేందర్‌, ఆదివాసి గిరిజన మహిళలు, గిరిజనులు పాల్గొన్నారు.

Updated Date - Oct 05 , 2025 | 11:21 PM