Share News

గిరిజన సంప్రదాయాలను కాపాడుకోవాలి

ABN , Publish Date - Nov 15 , 2025 | 11:00 PM

రిజనులు సంస్కృతి, సంప్రదాయాలకు ఎం తో విలువలున్నాయని, వాటిని కాపాడుకుంటూ నే దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని క లెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు.

గిరిజన సంప్రదాయాలను కాపాడుకోవాలి
బిర్సాముండా చిత్ర పటానికి పూల మాల వేసి ్చనివాళులర్పిస్తున్న కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

- కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

- బిర్సాముండా జయంతి సందర్భంగా ఘన నివాళి

నాగర్‌కర్నూల్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : గిరిజనులు సంస్కృతి, సంప్రదాయాలకు ఎం తో విలువలున్నాయని, వాటిని కాపాడుకుంటూ నే దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని క లెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. శనివారం ధర్తీ అబాభగవాన్‌ బిర్సాముండా 150వ జయం తి సందర్భంగా గుజరాత్‌లోని దేడియా పాడ నుంచి దేశప్రధాని నరేంద్రమోదీ ఆయనకు ని వాళులర్పించి ప్రసంగించారు. ప్రధాని ప్రసంగ కార్యక్రమాన్ని ప్రత్యేక ప్రసారం ద్వారా నాగర్‌క ర్నూల్‌ కలెక్టరేట్‌లోని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫిరంగి, విద్యాశాఖ అధికారి ఏ.ర మేష్‌ కుమార్‌, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వరి, జిల్లాక్రీడల అధికారి సీతారాం నాయక్‌, జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన గిరిజన ఆదివాసి నాయకులు మహిళ లు విద్యార్థులు తదితరులు ప్రధాని ప్రసంగాన్ని వీక్షించారు. అనంతరం బిర్సాముండా చిత్రపటా నికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఐటీ డీఏ అధికారులు, గిరిజన నాయకులు మంగ్య నాయక్‌, దేశ్యనాయక్‌, రవి, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు, వార్డెన్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గిరిజన మహిళలు పాల్గొన్నారు.

విద్యార్థులను పరామర్శించిన కలెక్టర్‌

పెద్దకొత్తపల్లి మండలం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయప డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిల చికి త్స పొందుతండగా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ శ నివారం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ప్ర మాద వివరాలను విద్యార్థులను అడిగి తెలుసు కున్నారు. ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు. క లెక్టర్‌ వెంట డీఈవో రమేష్‌కుమార్‌, డీఎం హెచ్‌వో రవినాయక్‌, వైద్యులు రోహిత్‌ ఉన్నారు.

ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ పరిశీలన

కలెక్టరేట్‌ ప్రాంగణంలోని ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ శనివారం సందర్శించారు. క్యాంటీన్‌లో సమోసా, కాఫీని కలెక్టర్‌ స్వీకరించి రుచి చూశారు. క్యాంటీన్‌ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి పర్చు కోవాలన్నారు. కలెక్టర్‌ వెంట కలెక్టరేట్‌ ఏవో చంద్రశేఖర్‌, డీఆర్‌డీఏ డీపీఎం కృష్ణ, ఏపీఎం చారి పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2025 | 11:00 PM